బిహార్ త్యాగధనుల గడ్డ

Published: Friday October 23, 2020

 

 à°ªà±à°°à°§à°¾à°¨à°¿ నరేంద్ర మోదీ బిహార్‌లో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఒకవేళ నితీశ్ నేతృత్వంలోని సర్కార్ త్వరగా స్పందించకపోతే... రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య పెరిగిపోయేదని పేర్కొన్నారు. పరిస్థితి అంతా అల్లకల్లోలంగా అయ్యేదని అన్నారు. ‘‘నితీశ్ సర్కార్ త్వరగా స్పందిచకపోతే... మహమ్మారి చాలా మందిని పొట్టనబెట్టుకునేది. ఊహించడానికే వీలుండేది కాదు. అల్లకల్లోలంగా ఉండేది. కరోనాతో పోరాడాం. à°ˆ రోజు బిహార్‌లో ప్రజాస్వామ్య పండుగను జరుపుకుంటున్నాం.’’ అని మోదీ తెలిపారు. ఎన్డీయే అధికారంలోకి రాక ముందు రాష్ట్రంలో అవినీతి, నేరాలు విపరీతంగా ఉండేవని పరోక్షంగా ఆర్జేడీపై విరుచుకుపడ్డారు.

 

గతంలో పేదల కోసం ఉద్దేశించిన డబ్బుతో అవినీతి పనులు చేశారని, కానీ తాము మాత్రం à°† డబ్బుతో కరోనా సమయంలో పేద కుటుంబాలకు ఉచిత ఆహారాన్ని అందించామని ఆయన గుర్తు చేశారు.దేశ రక్షణకు, భద్రతకు సంబంధించిన విషయంలో బిహార్ ప్రజలెప్పుడూ ముందుంటారని, గాల్వాన్ ఘర్షణను ఉదహరిస్తూ ఆయన పేర్కొన్నారు. ‘‘గాల్వాన్ సరిహద్దుల్లో తలెత్తిన ఘర్షణలో బిహార్‌కు చెందిన జవాన్లు దేశం కోసం అమరులయ్యారు. పుల్వామాలో కూడా. దేశం కోసం బిహార్ పౌరులు తమ ప్రాణాలనే ఇచ్చారు. వారికి నమస్కారం.’’ అని మోదీ వ్యాఖ్యానించారు.