కేంద్ర మంత్రి నిర్మలతో బుగ్గన సమావేశం

Published: Friday October 23, 2020

 à°†à°‚ధ్రుల జలజీవ నాడిగా తెరపైకి వచ్చిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం షాక్‌ ఇచ్చిన విషయం విదితమే. జాతీయ ప్రాజెక్టు హోదా ఉన్న పోలవరం అంచనా వ్యయాన్ని... 2013-14లో పేర్కొన్నట్లుగా రూ.20,398.61 à°•à±‹à°Ÿà±à°²à°•à±‡ పరిమితం చేసింది. 2013లో వచ్చిన కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం పరిహారం ఖర్చు భారీగా పెరగడంతో... ప్రాజెక్టు తుది అంచనా వ్యయం రూ.55,548.87 à°•à±‹à°Ÿà±à°²à°•à± చేరుకుంది. à°ˆ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశమయ్యారు. సుమారు అరగంటకు పైగా పోలవరం నిధుల విషయమై నిశితంగా చర్చించారు.

 

అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బుగ్గన.. పోలవరాన్ని పూర్తిగా తామే నిర్మిస్తామని విభజన చట్టంలో కేంద్రం చెప్పిందన్న విషయాన్ని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. ‘పునరావాసం, భూసేకరణ ఖర్చు కేంద్రానిదే అని చట్టంలో ఉంది. కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్ట్‌ను 2014లో రాష్ట్రం తీసుకుంది. 2014 నాటి ఖర్చు ఇవ్వాలని à°—à°¤ ప్రభుత్వం తీర్మానం చేసింది. పోలవరం ఖర్చును పరిమితం చేయాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. పోలవరం విషయంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. పోలవరం కాంట్రాక్టు పనులపైనే టీడీపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది’ à°…ని బుగ్గన వెల్లడించారు.