కోటి రూపాయలతో దుర్గాదేవి విగ్రహానికి అలంకరణ

Published: Monday October 26, 2020

దసరా ఉత్సవాలను పురస్కరించుకుని గద్వాల్‌లోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని కోటి రూపాయల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. నోట్లను పువ్వుల్లా తయారుచేసి అమ్మవారిని వాటితో అద్భుతంగా అలంకరించారు. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిన వేళ ఇలా కోటి రూపాయలతో అమ్మవారిని దుర్గాదేవిలా అలంకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలంకరణ కోసం వివిధ రంగుల్లో ఉన్న నోట్లను ఎంచుకున్నారు. à°† నోట్ల మొత్తం విలువ రూ. 1,11,11,111.  

 

గతేడాది అమ్మవారిని రూ.3,33,33,333 విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించినట్టు ఆలయ కోశాధికారి పి.రాము తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం కారణంగా గతేడాదితో పోలిస్తే ఈసారి ఆ మొత్తం తగ్గిందని పేర్కొన్నారు. స్థానిక కమ్యూనిటీకి చెందిన 40-50 మంది భక్తులు ఇచ్చిన నోట్లతో వీటిని అలంకరించామని, పూజల అనంతరం వాటిని తిరిగి వారికి అప్పగిస్తామని వివరించారు.