స్నానానికి దిగి ఆరుగురు యువకుల మృతి

Published: Thursday October 29, 2020

గ్రామస్తులంతా దసరా ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకొన్నారు. ఉత్సవాల ముగింపు అనంతరం ఆనవాయితీగా విహారయాత్రకు కూడా వెళ్లారు. అక్కడ వన భోజనాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అందరూ సరదాగా, సంతోషంగా గడుపుతున్నారు. ఇంతలో.. పక్కనే ఉన్న పెదవాగులో స్నానానికి వెళ్లిన వారిలో ఆరుగురు యువకులు మృత్యువాత పడ్డారు. దీంతో విహార యాత్ర కాస్త విషాద యాత్రగా మారింది.

 

పశ్చిమమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో బుధవారం à°ˆ విషాదం చోటుచేసుకుంది భూదేవిపేట గ్రామానికి చెందిన వారు మండలంలోని వసంతవాడ పెదవాగు బ్రిడ్జ్‌ సమీపంలో బుధవారం వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మహిళలంతా వంటా వార్పులో నిమగ్నమవగా.. ఏడుగురు యువకులు పక్కనే ఉన్న పెదవాగులో స్నానానికి దిగారు. మొదట లోతు తక్కువ ప్రాంతంలోనే స్నానాలు చేస్తూ అవతల గట్టు వైపునకు వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో చాలా లోతుగా ఉన్న ప్రాంతంలోకి దిగారు. దీంతో ఏడుగురు యువకుల్లో ఆరుగురు చూస్తుండగానే నీటి మడుగులోకి జారిపోయారు.

 

మరో యువకుడు బాడిస రాము వారిని రక్షించే ప్రయత్నంచేసినా వీలు పడలేదు. దీంతో పెద్దగా కేకలు వేశాడు. గ్రామస్తులు వచ్చి రక్షించే ప్రయత్నం చేసేలోగా పూర్తిగా నీట మునిగారు. వాగులో గాలించగా.. గంగాధర వెంకట్రావు (17) మృతదేహం లభ్యమైంది. కొన్ని à°—à°‚à°Ÿà°² తర్వాత శ్రీరాముల శివాజీ (16), పుట్టపర్తి మనోజ్‌ (18), కర్నాటి రంజిత్‌ (21), కెల్లా భువనసాయి (16), కూనవరపు రాధాకృష్ణ (19) మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒకేరోజు ఆరు కుటుంబాలకు చెందిన యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. చనిపోయిన యువకుల కుటుంబాలకు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేలు చొప్పున అందించారు.