ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.

Published: Thursday October 29, 2020

 à°œà°—న్ సర్కార్ మందుబాబులకు శుభవార్త చెప్పింది. తాజాగా.. మద్యం ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మీడియం, ప్రీమియంలో 25శాతం వరకు ధరలను తగ్గిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో అబ్కారీశాఖ పేర్కొంది. à°ˆ తగ్గిన ధరలు రేపటి నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. 250 నుంచి 300 రూపాయల మధ్య ఉన్న మద్యం ధరలపై ప్రభుత్వం రూ.50 తగ్గించింది. దీంతో.. వివిధ కేటగిరీల్లో ధరలు తగ్గాయి. ఐఎమ్‌ఎఫ్‌ఎల్‌, విదేశీ మద్యం ధరలు తగ్గాయి. గతేడాదితో పోల్చుకుంటే à°ˆ ఏడాది మద్యం అమ్మకాలు భారీగా పడిపోవడంతో ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించి.. సేల్స్‌ను పెంచాలని నిర్ణయించింది. మద్యం ధరలను తగ్గించి లిక్కర్‌ సేల్స్‌ ద్వారా ఖజానా నింపుకునే ప్రయత్నానికి తెరలేపింది. ఎన్నికల ప్రచారంలో మద్య నిషేధం పేరుతో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ఇప్పుడు మాత్రం మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు ఉవ్విళ్లూరుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.