వాయు కాలుష్యానికి రూ.1 కోటి జరిమానా

Published: Thursday October 29, 2020

వాయు కాలుష్య కారకులకు à°•à° à°¿à°¨ శిక్షలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలపడంతో బుధవారం రాత్రి నుంచి à°ˆ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చింది. వాయు కాలుష్య కారకులకు గరిష్ఠంగా ఐదేళ్ళ జైలు శిక్ష, రూ.1 కోటి వరకు జరిమానా విధించేందుకు à°ˆ ఆర్డినెన్స్ అవకాశం కల్పించింది. 

 

దేశ రాజధాని నగరం ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా ఉంది. దీనిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా త్వరలోనే à°•à° à°¿à°¨ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పిన సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల రైతులు వరి దుబ్బులను కాల్చడంపై నిషేధం విధించాలని à°ˆ వ్యాజ్యం కోరింది. 

 

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం, దేశ రాజధాని నగరంతోపాటు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కోసం à°“ కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. à°ˆ ఆర్డినెన్స్ నిబంధనలను, కమిషన్ ఆదేశాలను ఉల్లంఘించినవారిని గరిష్ఠంగా ఐదేళ్ళ జైలు శిక్ష లేదా రూ.1 కోటి వరకు జరిమానా లేదా à°ˆ రెండు శిక్షలతో శిక్షించవచ్చు. 

 

à°ˆ కమిటీ చైర్మన్‌ను పర్యావరణం, అడవుల శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ ఎంపిక చేస్తుంది. à°ˆ ఎంపిక కమిటీలో సభ్యులుగా రవాణా, వాణిజ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రులు, కేబినెట్ సెక్రటరీ వ్యవహరిస్తారు. 

 

à°ˆ కమిషన్ గాలి కలుషితమవడానికి దోహదపడుతున్న అంశాలను పరిశీలిస్తుంది. వరి దుబ్బుల కాల్చివేత, వాహన కాలుష్యం, ధూళి కాలుష్యం, గాలి నాణ్యతను క్షీణింపజేసే ఇతర అంశాలను పరిశీలిస్తుంది. à°ˆ కమిషన్ వార్షిక నివేదికలను పార్లమెంటుకు సమర్పిస్తుంది. కమిషన్ ఆదేశాలపై సివిల్ కోర్టుల్లో సవాలు చేయడానికి వీల్లేదు, కేవలం జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ)లోనే సవాలు చేయవచ్చు.