కరోనా అవగాహనపై క్యాండిల్ ర్యాలీ

Published: Friday October 30, 2020

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ మునుపటితో పోలిస్తే చాలా వరకు తగ్గింది. అయితే à°ˆ క్రమంలో కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇందుకుగాను విజయవాడలోని బెంజ్‌సర్కిల్ నుంచి కరోనా అవగాహనపై క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం రాత్రి బెంజ్ సర్కిల్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. à°ˆ ర్యాలీలో జిల్లా అధికార యంత్రాంగం పాల్గొన్నది. భారీ సంఖ్యలో పాల్గొన్న ఆశావర్కర్లు, ఏఎన్ఏంలు, వార్డ్, హెల్త్ సెక్రటరీలు పాల్గొన్నారు. గో కరోనా.. గో కరోనా అంటూ నినాదాలు చేశారు. ఇంట్లో నుంచి బయటికి వచ్చిన ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనాపై పది రోజుల నుంచి అవగహన సదస్సులు నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనాపై అవగాహనలో భాగంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంట్లో నుంచి బయటికి వచ్చిన ప్రతి ఒక్కరు తప్పకుండా మాస్కు ధరించాలని పిలుపునిచ్చారు.

 

విజయవాడ సీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. కేంద్రం లాక్‌డౌన్  సడలింపులు ఇవ్వడంతో ప్రజలంతా ఒక్కసారిగా బయటికి వస్తున్నారని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని పిలుపునిచ్చారు. à°ˆ సందర్భంగా వైద్య శాఖ కమిషనర్ భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనాపై అవగహన సదస్సులు నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరు ఆరు అడుగులు భౌతిక దూరం పాటించాలన్నారు. కరోనాపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని భాస్కర్ సూచించారు.