కాబూల్‌ యూనివర్సిటీలో టెర్రర్ అటాక్.

Published: Monday November 02, 2020

ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన ఉగ్రదాడిలో 25 మంది మృతి చెందారు. మరో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, భద్రతా దళగాలు ప్రతి దాడి చేసి దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులనూ మట్టు బెట్టారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. à°ˆ ఆపరేషన్ ఆరు à°—à°‚à°Ÿà°² పాటు కొనసాగిందని ఆఫ్ఘన్‌కు చెందిన à°“ మీడియా సంస్థ పేర్కొంది. అయితే à°ˆ దాడి వెనుక ఎవరి హస్తం ఉందనే విషయం తెలియలేదని, దీనిపై ఏ ఉగ్రవాద సంస్థ ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదని స్థానిక వర్గాలు వెల్లడించాయి.

 

‘‘విశ్వవిద్యాలయంలో ముగ్గురు ఉగ్రవాదులు దూరి దాడికి పాల్పడ్డారు. అనంతరం జరిగిన ప్రతిదాడిలో ముగ్గురూ మరణించారు. తాము దాడికి పాల్పడలేదని తాలిబన్ ప్రకటించింది’’ అని ఆఫ్ఘనిస్తాన్ మంత్రి తారిఖ్ అరియాన్ అన్నారు. ఆఫ్ఘన్ నుంచి అమెరికా పూర్తిగా వైదొలగాలనే ఉద్దేశంతో అరబ్‌లోని ఖతార్ రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయి. à°ˆ నేపధ్యంలోనే ఉగ్రదాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.