దిగ్గజ ఐటీ కంపెనీలతో ఒప్పందాలు

Published: Wednesday November 04, 2020

విశాఖలో ఐటీ హైఎండ్‌ నైపుణ్య విశ్వవిద్యాలయం పనులు వీలైనంత త్వరలో ప్రారంభించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన ఐటీరంగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. à°ˆ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏటా కనీసం 2వేల మందికి విశాఖ సంస్థలో శిక్షణ ఇవ్వాలన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా డిగ్రీ, డిప్లొమా కోర్సులు ప్రారంభించాలన్నారు. ఏఐ, రోబోటిక్స్‌ వంటి అత్యాధునిక అంశాల్లో విద్యార్థులు అక్కడే శిక్షణ పొందాలని, వారికి ఉపాఽధి కల్పన కోసం ఐటీ దిగ్గజ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఆదేశించారు. కాగా, గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు సంబంధించి అవసరమైన భూసేకరణపై దృష్టిపెట్టాలని, à°•à°¡à°ª విమానాశ్రయం విస్తరణ కోసం కూడా భూములు సేకరించాలని సీఎం ఆదేశించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇంకా 98 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని అధికారులు చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల కోసం కూడా భూమిని సేకరించాల్సి ఉందన్నారు. కాగా, విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో ఏర్పాటు చేయనున్న స్మృతివనంలోని అంబేడ్కర్‌ విగ్రహం సుదీర్ఘకాలం పాటు ఏమాత్రం à°•à°³ తగ్గకుండా జాగ్రత్త వహించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. స్మృతివనంలో పచ్చదనానికి, ల్యాండ్‌స్కేపింగ్‌కు ప్రాధాన్యమివ్వాలన్నారు. గ్రంథాలయం, మ్యూజియం, గ్యాలరీల ఏర్పాటుతో పాటు అంబేడ్కర్‌ జీవిత విశేషాలు ప్రదర్శించాలని సూచించారు. అంతకుముందు, అంబేడ్కర్‌ స్మృతివనంలో రాజ్యాంగ నిర్మాత భారీ విగ్రహం, ఇతర నిర్మాణాలకు సంబంధించి రెండు ప్రణాళికలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రదర్శించిన అధికారులు... వాటి ప్రత్యేకతలను వివరించారు. నాగపూర్‌లోని అంబేడ్కర్‌ దీక్షాభూమి, ముంబైలోని చైత్యభూమి, లఖ్‌నవూలోని అంబేడ్కర్‌ స్మారకం, నోయిడాలోని ప్రేరణాస్థల్‌లను చూపుతూ స్మృతివనంలో గ్యాలరీ, ఆడిటోరియంపై ప్రణాళికల గురించి తెలిపారు. పనులు మొదలుపెట్టిన 14నెలల్లో పూర్తిచేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నట్లు చెప్పారు.