ఏళ్లకు ఏళ్లు గడవాల్సిందే...

Published: Friday November 06, 2020

అంగన్‌వాడీ పిల్లలకు ఆహారం ఇవ్వాలి. సాంఘిక సంక్షేమ పాఠశాలలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు డబ్బు చెల్లించాలి. కొత్తగా రోడ్లు వేయక పోయినా పాత పనులను కొనసాగిస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి. ప్రభుత్వ భవనాలు, సాగునీటి ప్రాజెక్టుల పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకూ డబ్బులు ఇవ్వాలి. ఉపాధి హామీ పథకం à°•à°¿à°‚à°¦ చేపట్టిన పనులకూ బిల్లులు చెల్లించాలి. ఇంకా అనేక రకాల పనులు! వీటన్నింటికీ సంబంధించిన బకాయిలు కొండలా పేరుకుపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పు దాదాపు రూ.1.35 లక్షల కోట్లు! అచ్చంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక చెల్లించాల్సిన బిల్లులు రూ.60 వేల నుంచి 70 వేల కోట్లు. ఇక... à°—à°¤ ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులను కూడా చేర్చితే మొత్తం బిల్లుల బకాయిలు అక్షరాలా లక్ష కోట్ల రూపాయలు!

సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా ఒక్క సంవత్సరం బిల్లులు కొంతవరకు పెండింగ్‌లో ఉంటాయి. వైసీపీ వచ్చాక ఒకటిరెండు అస్మదీయ కాంట్రాక్టు సంస్థలకు తప్ప... మిగిలిన వారందరికీ బకాయి పెట్టేస్తున్నట్లు సమాచారం. లక్ష కోట్ల బకాయిల లెక్క వినగానే అధికారుల గుండె గుభేల్‌మంటోంది. ఒక్క ఉపాధి హామీ పథకం బిల్లులే దాదాపు రూ.2500 కోట్ల వరకు ఉన్నాయి. ఆర్థిక కష్టాలు, అప్పులతో లాక్కొస్తున్న సర్కారు.. రూ.లక్ష కోట్ల బిల్లులను చెల్లించలగలదా అనే సందేహం తలెత్తుతోంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల ప్రకారం... à°† పెండింగ్‌ బిల్లులు చెల్లించాలంటే మూడు బడ్జెట్లు ఎదురుచూడాల్సిందే. à°—à°¤ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.1,10,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు రూ.60,000 కోట్లు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఈఏపీ, నాబార్డు, ఆర్‌ఐడీఎఫ్‌, ఇతర ప్రాజెక్టుల నిధులు రూ.20,000 కోట్లు. వీటిని వేరే పథకాలకు ఖర్చు పెట్టడానికి లేదు. మిగిలిన రూ.30,000 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిర్వహించి, బిల్లులు చెల్లించాలి. ఇందులో సంక్షేమ పథకాల కోసం పూర్తిగా ప్రభుత్వం అప్పుల మీదే ఆధారపడుతోంది! మిగిలిన రూ.30,000 కోట్లతో అచ్చంగా బిల్లులు చెల్లిస్తారనుకున్నా... మొత్తం పెండింగ్‌ క్లియర్‌ కావడానికి మరో మూడు బడ్జెట్లకుపైనే పడుతుంది. ‘‘సంక్షేమ పథకాల అమలు కోసం పూర్తిగా అప్పుల మీద ఆధారపడుతున్న ప్రభుత్వం... తలకిందుల తపస్సు చేసినా à°ˆ పెండింగ్‌ బిల్లుల కొండను క్లియర్‌ చేయలేదు. సంక్షేమ పథకాలా? బిల్లులా? అనేది తేల్చుకోవాల్సిందే’’ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.