ఏ పంట పండించినా సమస్య లేదు

Published: Friday November 06, 2020

రైతులు ఏ పంట పండించినా మార్కెటింగ్ సమస్య లేకుండా చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు. ‘రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావాల్సిన పూర్తి సహకారం ఇస్తున్నాం. 5 వేలకు పైగా పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. మార్కెట్ రేటు కంటే ఎక్కువ ధరకు పంట కొనుగోళ్లు చేస్తున్నాం. ఏడాది పంట నష్టపోతే అదే ఏడాది రాయితీ రైతులకు ఇవ్వాలని నిర్ణయం. అక్టోబర్ నెల పంట నష్టం పరిహారాన్ని నవంబరు నెలలో నేరుగా రైతుల ఖాతాల్లో జమ. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం క్రింద రూ. 510 కోట్లు రాయితీ రైతులకు ఇవ్వాలని నిర్ణయం. à°—à°¤ ప్రభుత్వ హయాంలోని బకాయిలు కూడా చెల్లిస్తున్నాం. అధిక వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంట కొనుగోలు పైనా త్వరలో నిర్ణయం తీసుకుంటాం’ అని మంత్రి భరోసా ఇచ్చారు.

‘కొత్తగా విత్తనోత్పత్తి విధానం తీసుకురావాలని నిర్ణయం. విత్తనాలు ఉత్పత్తి చేసే ప్రతి ఒక్కరు రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి. నకిలీ విత్తనాల ద్వారా రైతులు నష్టపోకూడదని à°ˆ నిర్ణయం. వ్యవసాయ సలహా మండల్లు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఏర్పాటు జరుగుతోంది. రైతుల భాగస్వామ్యం అన్ని దశల్లో ఉండాలనే à°ˆ నిర్ణయం. ఆరు జిల్లాల్లో రబీ పంటల సాగు,  మార్కెటింగ్ సంబంధించి వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే ఖరీఫ్ పంటల కొనుగోలు ఏర్పాట్లపైనా సమీక్షించాం. వరి 62 లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యం . మొక్కజొన్న 2.60 లక్షల  టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించాం’ అని మంత్రి వెల్లడించారు.