పదెకరాల ఎఫ్‌టీఎల్‌ కబ్జాకు స్కెచ్‌..

Published: Saturday November 07, 2020

హైటెక్‌ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న సున్నం చెరువు! ఇప్పటికే చెరువు శిఖంలో పెద్దఎత్తున భవనాలు వచ్చేశాయి. ఎఫ్‌టీఎల్‌లోని సుమారు 10 ఎకరాల కబ్జాకు అధికార పార్టీలోని కొంతమంది పెద్దలు స్కెచ్‌ వేశారు.   à°°à°¾à°¤à±à°°à°¿à°•à°¿ రాత్రి చెరువులో మట్టి పోయడం, చదును చేయడం.. à°† తర్వాత పెద్దఎత్తున నిర్మాణాలు చేపట్టడం à°·à°°à°¾ మామూలుగా మారింది. à°ˆ చెరువును ఆక్రమంచి ఇప్పటి వరకు వెలిసిన నిర్మాణాలకు అడ్డు లేదు. దాంతో, కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. తాజాగా, ఐదు ఎకరాలకుపైగా ఎఫ్‌టీఎల్‌ భూమి కబ్జాకు గురైంది. దీని విలువ రూ.200 కోట్లకుపైగా ఉంటుందని అంచనా.

 

à°“ మంత్రి కుమారుడు ఎఫ్‌టీఎల్‌ ఫెన్సింగ్‌ తొలగించి మరీ సుమారు వెయ్యి చదరపు గజాల మేర కబ్జాకు పాల్పడ్డారు. దాని చుట్టూ పూర్తిగా రేకుల రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బాలానగర్‌ మండలంలోని అల్లాపూర్‌ రెవెన్యూ పరిధిలో సున్నం చెరువు ఉంది. 26 ఎకరాల à°ˆ చెరువులో 15.23 ఎకరాల్లో నీళ్లుంటాయి. 2013లో హెచ్‌ఎండీఏ 4805 ఐడీ నంబర్‌ ఇచ్చింది. చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే సర్వే నంబర్‌ 13, సర్వే నంబర్‌ 14, సర్వే నంబర్‌ 16 ఉన్నట్లుగా నిర్ధారించింది. à°† సర్వే నంబర్లలోనే బఫర్‌ జోన్ల ను కూడా పేర్కొంది.

 

కాగా, ఆయా సర్వే నంబర్లలోని స్థలానికి కొంతమంది ఇప్పటికే అక్రమంగా పట్టాలు పొందారు. చెరువులోని à°† స్థలం ‘మాదే’ అంటూ నలుగురైదుగురు కోర్టుకు కూడా వెళ్లారు. సున్నం చెరువు శిఖం భూమి, బఫర్‌ జోన్‌ స్థలాలపై గతంలో ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాలకు రెవెన్యూ అధికారులు స్పందించారు. కబ్జాదారుల పై కేసులు నమోదు చేశారు. కానీ, నెల రోజుల నుంచి రాజకీయ నాయకుల అండదండలు, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారుల సహకారాలతో కబ్జాదారులు శిఖం, బఫర్‌ జోన్‌లో మట్టి నింపుతున్నారు. చెరువుల ఆక్రమణ కారణంగానే à°—à°¤ నెలలో వరదలకు హైదరాబాద్‌లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. అదంతా కళ్లెదుటే  కదలాడుతున్నా.. అధికార పార్టీ నేత లు చెరువులు కబ్జా చేస్తున్నారు.