దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ-49

Published: Saturday November 07, 2020

భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ-49 రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం à°ˆ ప్రయోగం చేపట్టారు. పీఎస్‌ఎల్వీ సీ-49 రాకెట్‌ ద్వారా స్వదేశానికి చెందిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌(ఈవోఎస్‌ 01) శాటిలైట్‌తో పాటు అమెరికాకు చెందిన నాలుగు ఉపగ్రహాలు, లక్స్‌ంబర్గ్‌కు చెందిన నాలుగు ఉపగ్రహాలు, తిథువేనియాకు చెందిన à°’à°• చిన్న తరహా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. వ్యవసాయం, ప్రకృతి వైపరిత్యాలపై ఈవోఎస్‌ 01 అధ్యయనం చేయనుంది. షార్‌లో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రయోగ ప్రక్రియను చేపట్టారు.పీఎస్‌ఎల్‌వీ సీ-49 ప్రయోగం విజయవంతం అయిన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి à°…భినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.