అనుమానపు రోగంతో వారి భర్తలే కడతేర్చారు

Published: Sunday November 08, 2020

ఇద్దరు మహిళా ఉద్యోగులను అనుమానపు రోగంతో వారి భర్తలే కడతేర్చారు. హతుల్లో ఒకరు విశాఖ జిల్లా నక్కపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌à°—à°¾ పనిచేస్తున్న దుర్గాభవానీ కాగా, మరొకరు à°•à°¡à°ª జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వార్డు వలంటీరు స్వర్ణలత.  పోలీసుల కథనం ప్రకారం.. పాయకరావుపేట మండలం పాల్తేరు శివారు అంకంపేటకు చెందిన దుర్గాభవానీకి రెండున్నరేళ్ల కిందట కానిస్టేబుల్‌ ఉద్యోగం వచ్చింది. ఆమె నక్కపల్లి స్టేషన్‌లో పనిచేస్తూ, కుటుంబంతో పోలీస్‌ క్వార్టర్‌లోనే నివాసం ఉంటున్నారు. భవానీ రోజూ విధులకు వెళ్లొస్తున్న క్రమంలో ఆమెపై భర్త సింహాద్రి అనుమానం పెంచుకున్నాడు. à°ˆ నేపథ్యంలో శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన దుర్గాభవానీపై.. ఫోన్‌ ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చాడు. à°† తరువాత ఏం జరిగిందో గానీ.. అర్ధరాత్రి à°’à°‚à°Ÿà°¿ à°—à°‚à°Ÿ ప్రాంతంలో సింహాద్రి ఇంటి నుంచి బయటకు వచ్చి తన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చుట్టుపక్కల వారికి చెప్పాడు.

అయితే, అర్ధరాత్రి.. భార్యాభర్తల మధ్య గొడవతో పాటు, పెనుగులాట జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రాథమిక సాక్ష్యాధారాల మేరకు  హత్యగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే, ప్రొద్దుటూరు మండలం రంగసాయిపురానికి చెందిన మందాడి జయరామిరెడ్డి, లేబాక స్వర్ణలత దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. వార్డు వలంటీరుగా పనిచేస్తున్న భార్య స్వర్ణలత(35)పై జయరామిరెడ్డి అనుమానం పెంచుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేయాలని వేధించసాగాడు. ఆమె తనమాట వినకపోవడంతో పది రోజుల క్రితం జయరామిరెడ్డి కుమారులిద్దరిని తీసుకుని స్వగ్రామం రంగసాయిపురం వెళ్లాడు. శనివారం మధ్యాహ్నం ప్రొద్దుటూరుకు వచ్చి భార్యతో గొడవపడి భార్య గొంతుకు ప్లాస్టిక్‌ వైర్‌తో బిగించి హత్యచేసి పారిపోయాడు.