రోజుకో రకం లెక్కలతో జలశక్తి శాఖ గందరగోళం

Published: Sunday November 08, 2020

పోలవరం ప్రాజెక్టు అంచనాలపై కేంద్ర జలశక్తి శాఖ రోజుకో లెక్కలు చూపుతూ తిరకాసు పెడుతోంది. సహాయ పునరావాసానికి కేవలం రూ.16,869.98 కోట్లు మాత్రమే వ్యయమవుతుందని తాజాగా వెల్లడించింది. 2017-18లో à°† శాఖ సాంకేతిక సలహా కమిటీ అంచనాల మేరకు మొత్తం వ్యయం రూ.55,548.87 కోట్లు. ఇందులో భూసేకరణ వ్యయం రూ.33 వేల కోట్లు. అదే అంచనాల సవరణ కమిటీ నివేదిక మేరకు మొత్తం వ్యయం రూ.47,725.74 కోట్లు కాగా, భూసేకరణ వ్యయం రూ.28వేల కోట్లు. అంటే అక్కడే రూ.5వేల కోట్లు తగ్గింది. ఇక తాజా లెక్కల ప్రకారం ఏకంగా రూ.11,130 కోట్ల మేర భూసేకరణలో జలశక్తి శాఖ కోత విధించింది. à°ˆ గణాంకాలను పరిశీలిస్తే ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల వ్యయంపై పూర్తిస్థాయిలో సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని స్పష్టమవుతోందని జల వనరుల నిపుణులు పేర్కొంటున్నారు. భూసేకరణ సహాయ పునరావాస కార్యక్రమాల వ్యయంపై సమాచార హక్కు చట్టం à°•à°¿à°‚à°¦ జలశక్తి శాఖను అమలాపురానికి చెందిన వి.రమేశ్‌ చంద్రవర్మ లిఖిత పూర్వక సమాచారం కోరారు. దీనికి à°† శాఖ డైరెక్టర్‌ పి.దేవేందర్‌రావు శనివారం సమాధానం పంపారు.  పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) మెంబర్‌ సెక్రటరీ రంగారెడ్డి అందించిన సమాచారం మేరకు భూ సేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలకయ్యే వ్యయాన్ని వివరిస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు. ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ చేస్తే .రూ.16,869.98 కోట్లు వ్యయమవుతాయని జలశక్తి శాఖ వెల్లడించింది. 84,731 మంది నిరాశ్రయులకు గృహాల కోసం రూ.11,057.43 కోట్లు, నగదు చెల్లింపులకు రూ.5,812.55 కోట్లు వ్యయం అవుతాయని తెలిపింది. అదే 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వచేస్తే పునరావాస కాలనీల్లో 9,882 ఇళ్లకుగాను రూ.1,204.09 కోట్లు కావాలని ఇందులో రూ.318.73 కోట్లు వ్యయమయ్యాయని వెల్లడించింది. మరో 885.36కోట్లు విడుదల చేయాల్సి ఉంటుందని తెలిపింది. నగదు చెల్లింపులకు 816.63 కోట్లు కావాలని, ఇందులో 138.73 కోట్లు వ్యయం చేసినందున మిగిలిన 677.90 కోట్లు నిధులు విడుదల చేయాల్సి ఉందని వివరించింది. మొత్తం రూ.2,020.72 కోట్లలో మిగిలిన 1,563.26 కోట్ల మేర నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 

2013-14 లెక్కల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లుగా కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. అయితే à°ˆ ఏడాదికి హెడ్‌వర్క్స్‌ పనులు, భూసేకరణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటూ జలశక్తి శాఖ సలహా సంఘం రూ.27,081.62 కోట్లుగా నిర్ధారించినట్లుగా పేర్కొంది. ఇక్కడే దాదాపు రూ.7వేల కోట్ల వ్యత్యాసం వచ్చింది. 2017-18లో సవరించిన రెండో అంచనాల మేరకు మొత్తం వ్యయం 55,548.87 కోట్లుగా జలశక్తి శాఖ చెబుతోంది. ఇదే అంచనాలకు ఆమోదం తెలపాలని రాష్ట్రం కూడా కోరుతోంది. కానీ కేంద్ర ఆర్థికశాఖ మాత్రం రూ.20,398.61 కోట్లకే పరిమితమవుతామని, à°ˆ మొత్తాన్నే 2017 మార్చి 15à°¨ కేంద్ర కేబినెట్‌ ఆమోదించిందని చెబుతోంది. à°—à°¤ ప్రభుత్వ హయాంలో అంచనాల సవరణలోనూ, హెడ్‌వర్క్స్‌ నిర్మాణంలో వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే అంచనాలు పెంచేసిందని ఆరోపణలు గుప్పించింది. అధికారంలోకి వచ్చాక పాత లెక్కలు ఆమోదించలేకపోతున్న వైసీపీ సర్కారు, గతప్రభుత్వ తప్పిదాల వల్లే à°ˆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు రావడం లేదన్న ఆరోపణలు చేయడంతోనే కాలయాపన చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పోలవరం ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చు, సవరించిన అంచనాలను బేరీజు వేసుకుని à°† లెక్కలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి ఒత్తిడిని పెంచడంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపట్లేదని సాగునీటి నిపుణులు విమర్శిస్తున్నారు. గతంలో పోలవరం కోసం చేసిన