త్తి రైతుని గులాబీ రంగు పురుగు వెంటాడుతోంది

Published: Monday November 09, 2020

పత్తి రైతుని గులాబీ రంగు పురుగు వెంటాడుతోంది. ఇప్పటికే అధిక వర్షాలతో పత్తి పైర్లు దెబ్బతినగా, ఇప్పుడు పురుగు ఉధృతమైతే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో పత్తి ఎక్కువగా సాగవుతోంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఆరు లక్షల హెక్టార్లలో పత్తి వేశారు. గత నెలలో భారీ వర్షాలకు పల్లపు ప్రాంతాల్లోని పత్తి పైరు దెబ్బతిన్నది. పూత, కాయ పాడైపోయాయి. అప్పటికే తీయాల్సిన పత్తి తడిసిపోయింది. కొంత గుడ్డిపత్తిగా మారింది. దీనివల్ల ఎకరానికి 2 క్వింటాళ్లపైగా పత్తిని రైతులు కోల్పోయారు. ఈ వైపరీత్యం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుండగా, పత్తిపై ర సం పీల్చే పురుగు ఆశించింది. ఇతర తెగుళ్లు కూడా ఉన్నా యి. తాజాగా గులాబీ రంగు పురుగు ఆశిస్తోందని రైతులు చెప్తున్నారు. పొలంలో లింగాకర్షక బుట్టలు పెటితే అందులో పడుతున్న తొలిదశలో ఉండే రెక్కల పురుగును బట్టి గులాబీ పురుగుని గుర్తిస్తున్నారు. ఈ పురుగు విజృంభిస్తే కాయలన్నీ పాడుచేసి, పత్తి కాపుని నాశనం చేస్తుంది.

 

à°—à°¤ మూడేళ్లుగా గులాబీ పురుగుతో ఎకరానికి నాలుగైదు క్వింటాళ్లపైగా పత్తి ని రైతు కోల్పోయారు. ఇప్పటికే ఉన్న రసం పీల్చే పురుగులకు క్రిమిసంహారక మందులు వాడుతున్న రైతులు.. గులాబీ పురుగు ఆశిస్తే ఇంకా పెట్టుబడులు పెరిగి, దిగుబడుల నష్ట పోవస్తుందని ఆందోళన చెందుతున్నారు. గుంటూరు సమీప గ్రామాల్లో పత్తి పొలాలను శనివారం వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఎకరానికి లీటర్‌ వేపనూనె లేదా క్వినాల్‌ఫాస్‌ 400ఎంఎల్‌ లేదా క్లోరిఫైరిఫాస్‌ 500 ఎంఎల్‌ లేదా ప్రొఫెనోఫాస్‌ 400ఎంఎల్‌ వారం రోజుల వ్యవధిలో మార్చి మార్చి పిచికారి చేయాలని, ఆఖరి దశలో 200ఎంఎల్‌ సైపర్‌ మైత్రిన్‌ పిచికారి చేయాలని రైతులకు సూచించారు.