పంట నష్టపోయి రైతుల విలాపం రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి

Published: Monday November 09, 2020

అతివృష్టి కారణంగా చేతికొచ్చిన పంట.. పొలంలోనే మట్టిపాలై రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. పంట దెబ్బతిని, పెట్టుబడులైనా దక్కకుండా.. అప్పుల పాలైన అన్నదాతలు కన్నీళ్లు దిగమింగుకుని పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నారు. జూలై నుంచి అక్టోబరు వరకు à°“ వైపు భారీ వర్షాలు, మరో వైపు  కృష్ణా, గోదావరి, కుందు, వంశధార నదులకు పోటెత్తిన వరదతో ఖరీఫ్‌ రైతులు భారీగా నష్టపోయారు. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు à°’à°• ఎత్తయితే, అక్టోబరులో వాయుగుండంతో జరిగిన నష్టం మరో ఎత్తు. దెబ్బమీద దెబ్బ తగిలి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు డెల్టా ప్రాంతాల్లో వరద ముంపుతో వరి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. కోతకొచ్చిన ధాన్యం తడిసిపోయింది. మెట్ట ప్రాంతాల్లో పత్తి పూత, కాయ వర్షార్పణమైంది. రాయలసీమలో వేరుశనగ వేరుకుళ్లుతో పాడైంది. లంక భూముల్లో ఉద్యాన, కూరగాయ తోటలు వరద ముంపుతో నీట మునిగి దెబ్బతిన్నాయి. à°ˆ పరిస్థితుల్లో కేవలం అధికారులు అంచనాలు వేయడం తప్ప, సాయమేమీ అందించలేదు. పైగా వరద ముంపులో వారం రోజులు ఉంటేనే పంట నష్టం ఇస్తామంటూ ప్రభుత్వం పాత జీవోని అమలుల్లోకి తెచ్చింది. బాధితులు పునరావాస కేంద్రాల్లో ఉంటే, తిరిగి ఇంటికెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.500 మాత్రమే చేతిలో పెట్టారు. పంట నష్టాలతో కౌలు రైతులకు పెట్టుబడులు కూడా దక్కక అప్పుల పాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

రైతులు, కౌలు రైతులు ప్రభుత్వ సహాయాన్ని ఆశిస్తున్నారు. అయితే, పరిహారంపై ఆశలు పెట్టుకున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. పెట్టుబడి సాయం ఇస్తున్నామన్న ఉద్దేశంతో పరిహారం ఊసెత్తకుండా à°•à°‚à°Ÿà°¿ తుడుపుగా ఇన్‌పుట్‌ సబ్సిడీని మాత్రమే మంజూరు చేసింది. అది కూడా 30ు కంటే ఎక్కువ పంట నష్టపోయిన చిత్తూరు మినహా 12 జిల్లాలకు రూ.135 కోట్లు విడుదల చేసింది. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు జరిగిన నష్టానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ à°•à°¿à°‚à°¦ ప్రస్తుత రబీ సాగుకు విత్తనాలు ఇస్తున్నారు. à°—à°¤ నెలలో వాయుగుండంతో భారీగా పంట దెబ్బతినగా, కేవలం 2.5 లక్షల హెక్టార్లలోనే పంట దెబ్బతిందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. 

విపత్తుతో రాష్ట్రానికి రూ.4,500 కోట్ల మేరకు నష్టం జరిగిందని, తక్షణం రూ.వెయ్యి కోట్లివ్వాలని సీఎం జగన్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు కొన్నాళ్ల కిందట లేఖ రాశారు. అయితే, నష్టాన్ని పరిశీలించాకే పరిహారాన్ని ప్రకటించే ఆలోచనలో ఉన్న కేంద్రం ఏపీకి à°’à°• బృందాన్ని నియమించింది. కేంద్ర హోంశాఖలోని జాయింట్‌ సెక్రటరీ సౌరవ్‌రాయ్‌ నేతృత్వంలో బృందం సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పర్యటించనుంది. రెండు జట్లుగా ఏర్పడి మొదటి రోజు సోమవారం కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాలు, రెండో రోజు మంగళవారం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పంట, ఆస్తి నష్టాలను పరిశీంచనుంది. వాస్తవంగా మిగిలిన జిల్లాల్లోనూ పంట నష్టం జరిగినా, కేంద్ర బృందం ఐదు జిల్లాలకే పరిమితమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టం రూ.6 వేల కోట్ల పైగానే ఉంటుందని రైతుప్రతినిధులు చెబుతున్నారు. కానీ అధికారులు 5జిల్లాల్లోనే నష్టం చూపడంతో కేంద్రబృందం అక్కడే పర్యటిస్తోంది.