కాంగ్రెస్‌కు రాములమ్మ ఝలక్..

Published: Tuesday November 10, 2020

 à°¦à±à°¬à±à°¬à°¾à°•à°²à±‹ à°“à°¡à°¿à°¨ కాంగ్రెస్‌ మూడో స్థానానికి పరిమితం కావడం à°† పార్టీని మరింత కుంగదీస్తోంది. తీవ్ర నిస్తేజంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దుబ్బాక ఓటమితో వలసల భయం పట్టుకుంది. ఉత్తమ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న చాలా మంది హస్తం పార్టీకి హ్యాండిచ్చి కమలం గూటికి వెళ్లాలని ఇప్పటికే డిసైడ్ అయి.. à°† తరుణం కోసం ఎదురుచూస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమితో ఇలాంటి అసంతృప్త నేతల వలసలకు అవకాశం దొరికింది. ఇప్పటికే.. కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి కూడా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా.. విజయశాంతి కాంగ్రెస్ తరపున ప్రచారం కూడా చేయకపోవడం గమనార్హం. వచ్చే వారం ఆమె ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

 

 

బీజేపీ అగ్ర నాయకత్వం ఇప్పటికే మూడుసార్లు విజయశాంతితో చర్చలు జరిపింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఇటీవల భేటీ కాగా, అంతకుముందే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండుసార్లు సమావేశమయ్యారు. à°ˆ మూడు సందర్భాల్లోనూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిపై బీజేపీ చేస్తున్న పోరాటాలను రాములమ్మ ప్రశంసించినట్లు సమాచారం. ప్రభుత్వ విధానాలపై సంజయ్‌ దూకుడు వైఖరి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో, ఆమె కూడా ఇదే పంథా కోరుకుంటున్నట్లు తెలిసింది. కాగా, సంజయ్‌తో సమావేశానికి ముందే విజయశాంతి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో సమావేశమైనట్లు ముఖ్య నేత ఒకరు ‘ఆంధ్రజ్యోతి’à°•à°¿ వెల్లడించారు. అయితే, నడ్డా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారని చెప్పారు. మరోవైపు విజయశాంతి గొప్ప నాయకురాలని, తెలంగాణ మిగతా ఉద్యమకారుల్లాగే ఆమెకూ కేసీఆర్‌ అన్యాయం చేశారంటూ సంజయ్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. బీజేపీకి మద్దతుగా విజయశాంతి ఆదివారం ట్వీట్‌ చేయడం విశేషం.