పోలీసులకు భయపడొద్దు.. హోంశాఖ మంత్రి సుచరిత

Published: Tuesday November 10, 2020

పోలీసుల వేధింపుల వల్లే కుటుంబం మొత్తం ప్రాణాలు వదిలేస్తున్నామంటూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడిన నంద్యాల ఆటో డ్రైవర్‌ అబ్దుల్‌ సలామ్‌ కుటుంబంలో మిగిలిన 65ఏళ్ల మహిళ(అబ్దుల్‌ అత్త)కు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారాన్ని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు. సోమవారం ఆమె విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. నేర విచారణలో భాగం à°—à°¾ పోలీసులు ప్రశ్నించినంత మాత్రాన ఎవ్వరూ భయపడి ఆత్మహత్యకు పాల్పడవద్దన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బాధ్యులైన పోలీసులను అరెస్టు చేస్తున్నామని చెప్పారు. అయితే ఎవరి ప్రాణాలూ పోవడానికి బాధ్యులు కాని అమరావతి దళిత రైతులకు బెయిల్‌ రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసుశాఖ.. నలుగురు మైనార్టీల బలవన్మరణానికి కారకులైన పోలీసుల బెయిల్‌ విషయంలో ఎందుకు అడ్డుకోలేదన్న ప్రశ్నకు..సమాధానం చెప్పకుండా దాటవేశారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ  పోలీసులు తప్పు చేస్తే  అరెస్టు చేసి జైలుకు పంపడంలాంటిది గతంలో చూశారా? అని ప్రశ్నించారు.  .