వైసీపీలో అంతర్గత విబేధాలు

Published: Thursday November 12, 2020

ఇటీవల విశాఖలో డీడీఆర్సీ సమావేశం జరిగింది. à°ˆ సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి, జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు. అయితే ఏం జరిగిందో ఏమోగానీ ఒక్కసారిగా ఎంపీ విజయసాయిరెడ్డిపై.. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేరుగానే విరుచుకుపడ్డారు. అధికారులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులముందే విజయసాయి తీరును ఎండగట్టారు. మరోవైపు.. ఇదే సమావేశంలోనే అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూడా తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ‘నాడు-నేడు’ పనుల్లో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. అధికారులు చిన్నచూపు చూస్తున్న వైనాన్ని జిల్లా అభివృద్ధి సమీక్షామండలి సమావేశంలో వివరించారు. అంతేకాకుండా.. తూర్పు గోదావరి జిల్లాలో మరో ఎమ్మెల్యే ఏకంగా మంత్రుల వ్యవహారశైలిని కడిగిపారేశారు. మంత్రులు తమ పాలిట దుష్ట శక్తుల్లా పరిణమించారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తమ మాటలు పట్టించుకునేవాళ్లే కరువయ్యారని, అభివృద్ధి పనులు అందుకే జరగడంలేదని పి. గన్నవరం ఎమ్మెల్యే  చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఈ మొత్తం వ్యవహారం గత 48 గంటలుగా విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి చేరడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారట. వెంటనే ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీని తాడేపల్లికి రావాలని సీఎం ఆదేశించారట. ముఖ్యమంత్రి నుంచి కబురు అందుకున్న విజయసాయిరెడ్డి హుటాహుటిన విశాఖ నుంచి తాడేపల్లికి బయల్దేరారు. మరోవైపు.. అమర్నాథ్, ధర్మశ్రీ కూడా తాడేపల్లికి పయనమయ్యారు.