బార్ అండ్ రెస్టారెంట్లకు అధికారుల షాక్

Published: Monday November 16, 2020

 à°¬à°¾à°°à± అండ్ రెస్టారెంట్లకు అధికారులు షాక్ ఇచ్చారు. చీప్‌ లిక్కర్ అమ్మకాలపై అనధికార షరతులు విధించారు. మీడియం, ప్రీమియం బ్రాండ్లు 50 కేసులు కొంటేనే 10 కేసులు చీఫ్ లిక్కర్ కొనుగోలుకు అనుమతి ఇస్తామంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే చీఫ్ లిక్కర్‌ను బార్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. మీడియం, ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలు తగ్గాయని కంపెనీల గగ్గోలు పెడుతున్నాయి. చీఫ్ లిక్కర్ కావాలంటే మీడియం, ప్రీమియం బ్రాండ్లు కొనుగోలు చేయాల్సిందేనని అధికారులు షరతులు విధించడంతో బార్ల యజమానుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారం తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.