ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు

Published: Tuesday November 17, 2020

ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి à°ˆ మేరకు నిర్ణయం తీసుకుంది. à°ˆ సందర్భంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవన్నారు. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలని పేర్కొన్నారు. ఏపీలో కరోనా ఉధృతి తగ్గిందని, కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753à°•à°¿ తగ్గిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు. తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని, ఎన్నికల నిర్వహణ రాజ్యంగపరమైన అవసరమని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని, 4 వారాల ముందు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని రమేష్ కుమార్ పేర్కొన్నారు.

 

ప్రభుత్వం, రాజకీయపక్షాలు, అధికారులంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు. రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా.. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకు à°ˆ ఎన్నికలు అవసరమన్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని, స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ రమేష్‌ స్పష్టం చేశారు.