రైతుల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు

Published: Tuesday November 17, 2020

రాజధాని రైతుల్ని ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. పవన్‌కళ్యాణ్‌ను అమరావతి రైతులు, మహిళలు కలిశారు. భూములు ఇచ్చి మానసిక క్షోభ అనుభవిస్తున్నామని మహిళలు కన్నీరు పెట్టారు.

à°ˆ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ‘ఎప్పుడూ బయటకు రాని ఆడవాళ్లు రోడ్లపైకి వచ్చారు. లాఠీఛార్జ్‌లు, బేడీలను భరిస్తూ ఉద్యమం చేస్తున్నారు. దళితుల పైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టే స్థాయికి‌ వైసీపీ ప్రభుత్వం దిగజారింది. ఎంతోమంది మహిళలు తమ పుట్టింటి కానుకగా భూములు తెచ్చుకుని ఉంటారు. అటువంటి పొలాలను కూడా రాజధాని‌ కోసం త్యాగం చేశారు. ఏ ప్రభుత్వం మారినా à°—à°¤ ప్రభుత్వాల విధానాలను అమలు‌ చేయాలి. 2014లో జగన్ అమరావతికి అంగీకారం తెలిపారు. అప్పుడు వ్యతిరేకంగా ఉంటే..‌ మీరు‌ భూములు ఇచ్చే వారు కాదు. నేను రైతు పక్షపాతిని.. నాకు రైతుల కష్టం, భూమి విలువ నాకు తెలుసు. ఎస్ఇజెడ్‌à°² పేరుతో గతంలో కూడా రైతుల భూములను లాక్కున్నారు. 29వేల మంది రైతులు భూములు ఇస్తే.. ఇప్పుడు కులాలు, రాజకీయాలు అంటగడుతున్నారు. మీ భూములు మీకు ఇవ్వడానికి అవి ఎక్కడ ఉన్నాయో కూడా చెప్పలేని స్థితిలో రోడ్లు‌ వేశారు. గుంటలు తవ్వారు.. à°ˆ పరిస్థితిలో ప్రభుత్వం ఎలా మారుస్తుంది. ఆనాడు కులం, పార్టీ లేని జగన్‌కు ఇప్పుడు అవే కనిపిస్తున్నాయా?’ అని ప్రశ్నించారు.

 

‘అమరావతి ఉద్యమం మహిళలే ముందుండి నడిపిస్తున్నారు. నేను మీ వెనుకే... మీ వెంటే ఉంటాను. à°…à°‚à°¡à°—à°¾ నిలుస్తాను. అమరావతి ఉద్యమానికి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పుడు అవసరమైనా... జనసేన మీతో కలిసి నడుస్తుంది. నాకు ఓట్లు వేయకపోయినా... నేను ధర్మం వైపు నిలుస్తాను. రాజధాని అమరావతి అని అందరూ చెప్పారు. రాజధాని ఇక్కడే ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. పోలీసులు కూడా ఆలోచించాలి. పొలిటికల్ బాస్‌లు చెప్పినట్లు చేయవద్దు. ప్రజలు రోడ్లపైకి వస్తే ఏం జరుగుతుందో పోలీసులు కూడా ఆలోచించాలి. దళితులపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులు పూర్తిగా ఉపసంహరించుకోవాలి. బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్న సమయంలోనే అమరావతి రాజధానిగా నిర్ణయించాం. బీజేపీ నేతల వ్యాఖ్యలు గందరగోళంగా ఉన్నా.. అమరావతిలో‌ వారు కూడా క్లారిటీగా ఉన్నారు. వ్యవస్థలలో ఉన్న ఇబ్బందులు వల్ల.. కేంద్రం అన్ని అంశాలలో జోక్యం చేసుకోదు. బీజేపీ రాష్ట్ర పార్టీ నిర్ణయానికి కేంద్ర నాయకత్వం కట్టుబడి ఉంటుంది. మీకు చెప్పే విధానం నచ్చకపోయినా...‌ అమరావతి ఇక్కడే అనేది నిజం. ఇందులో ఎటువంటి తేడా జరిగినా...‌మీకు à°…à°‚à°¡à°—à°¾ నేను పోరాడతా’ నంటూ పవన్‌కల్యాణ్ రైతులకు భరోసా ఇచ్చారు.