నీటి నిల్వ తగ్గింపు సాధ్యం కాదు

Published: Wednesday December 02, 2020

పోలవరం ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం తగ్గించడం సాధ్యం కాని పని అని పోలవరం ప్రాజెక్టు అఽథారిటీ (పీపీఏ) చీఫ్‌ ఇంజనీర్‌ ఏకే ప్రధాన్‌ స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన నేతృత్వంలోని అఽథారిటీ బృందం మంగళవారం ప్రాజెక్టు ప్రదేశానికి వచ్చింది. స్పిల్‌ వేలో జరుగుతున్న కాంక్రీట్‌ పనులను పరిశీలించారు. గ్యాప్‌3 వద్ద జరుగుతున్న డ్యాం కాంక్రీటు పనులు, ఎగువ కాఫర్‌ డ్యాం, డయా ఫ్రం వాల్‌ ప్రాంతాలను, శాండిల్‌ డ్యాం, కుడికాల్వకు మార్గమైన జంట సొరంగాలు, రేడియల్‌ గేట్లను పరిశీలించారు. అనంతరం ప్రధాన్‌ విలేకరులతో మాట్లాడారు. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయని.. మొదటి డీపీఆర్‌లో ఉన్నట్లుగానే పనులు కొనసాగుతాయన్నారు. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 45.72మీటర్లకు ఏ మాత్రం తగ్గదన్నారు. తూర్పు గోదావరి జిల్లా అంగులూరులో జరుగుతున్న గ్యాప్‌ వన్‌ పనులను బుధవారం పరిశీలించనున్నట్లు తెలిపారు. బుధవారం భూసేకరణ, సహాయ పునరావాసం, కాఫర్‌డ్యామ్‌ నిర్మాణ పనులపై బృందం సమీక్షించనుంది.