ఖరీదైన ప్రాంతాల్లో ఆర్టీసీకి 1300 ఎకరాలు

Published: Friday December 04, 2020

రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు ఏవి అని అడిగితే వెంటనే గుర్తుకొచ్చేవి.. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కర్నూలు. à°ˆ కీలక నగరాల నడిబొడ్డున ఏపీఎ్‌à°¸ ఆర్టీసీకి కోట్లాది రూపాయల విలువైన స్థలాలు ఉన్నాయి. అదికూడా వాణిజ్యానికి అన్నివిధాలా అనుకూలంగా అవి ఉన్నాయి. ఇంకేముంది.. అధికార పార్టీ నేతల కన్ను వాటిపై పడింది! సుదీర్ఘ లీజు పేరుతో à°ˆ స్థలాలకు చాపచుట్టే ప్రణాళిక సిద్ధమయిపోయింది. ఎక్కడైనా లీజు అంటే 33 ఏళ్లకే రాసుకొంటారు. అలాంటిది యాభై ఏళ్లకు అత్యంత విలువైన ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చేలా ప్రభుత్వపెద్దలు పావులు కదుపుతున్నట్టు సమాచారం. బస్టాండ్లు, బస్‌ డిపోల స్థలాలను అభివృద్ధి చేసి..అదనపు ఆదాయం ఆర్జిస్తామని ఏపీఎ్‌సఆర్టీసీ అధికారులు పైకి చెబుతున్నా, దాని వెనుక కచ్చితంగా à°“ వర్గం దూరదృష్టి ఉందని పీటీడీ ఉద్యోగ సంఘాలు అనుమానపడుతున్నాయి.

 

రాష్ట్రంలో ఆర్టీసీకి 1300 ఎకరాల విస్తీర్ణంలో స్థలాలున్నాయి. విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో ఆరెకరాల స్థలాన్ని ఇప్పటికే సొంతం చేసుకునే ప్రక్రియ దాదాపు పూర్తయింది. తిరుపతి నడిబొడ్డున ఆర్టీసీకి ఉన్న 13 ఎకరాలు త్వరలో ప్రైవేటు పరం కానుంది. విజయవాడ ఆటోనగర్‌ బస్టాండుకు చెందిన రెండెకరాలు లీజు పేరుతో చేయి జారిపోతోంది. కర్నూలు రాజ్‌విహార్‌ ప్రాంతంలోని బస్టాండు స్థలం రెండెకరాలు ప్రైవేటు పరం కాబోతోంది. కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో 1.7 ఎకరాలు, గుంటూరు, నరసరావుపేట సహా రాష్ట్రంలోని మరిన్ని స్థలాలపై అధికార పార్టీ పెద్దలు కన్నేసినట్లు తెలుస్తోంది. ఏపీ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెట్‌(ఏపీయూఐఎంఎల్‌) సంస్థకు ఖరీదైన ఆస్తులు కట్టబెట్టేందుకు à°°à°‚à°—à°‚ సిద్ధం చేస్తున్నారు.