పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వమే

Published: Friday December 04, 2020

పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వమేనని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఇసుక విధానంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోనే  à°“ భవన నిర్మాణ కార్మికుడు  ఆవేదనతో à°ˆ దాడికి పాల్పడినట్టు తెలుస్తోందని చెప్పారు. ఘటనను ఎవరైనా తీవ్రంగా ఖండించాల్సిందేనని తెలిపారు. à°ˆ ఘటనను టీడీపీ ఖండించిందని కాని వైసీపీ నాయకులు à°ˆ దాడిని  టీడీపీకి, బలమైన బీసీ నాయకుడైన కొల్లు రవీంద్రకు అపాదించడంపై మండిపడ్డారు. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో అన్యాయంగా రవీంద్రను 53రోజులు సెంట్రల్ జైలులో పెట్టారని దుయ్యబట్టారు.

 

వైసీపీ నాయకుల కక్ష టీడీపీ నాయకులపై పెరిగిపోతుందన్నారు. ఈకక్ష ఇంకా తీరలేదని విమర్షించారు. మళ్లీ  కొల్లు రవీంద్రకు సంబంధం లేని కేసులో ఇరికించాలన్న  ప్రయత్నాలు చేస్తారా అని ప్రశ్నించారు. ఇసుక మాఫియా అగడాలు పెచ్చుమీరుతున్నాయని ఆరోపించారు.ఇసుక అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు 52 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.   à°‡à°¸à±à°• దొరక్క పోవడంతోనే మంత్రుల ఇళ్ల వద్ద కార్మికులు ధర్నాలు చేశారని చెప్పారు. పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో న్యాయబద్ధంగా విచారించాలి కాని కొల్లురవీంద్రపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితువు పలికారు.