‘3 రాజధానుల’తో దెబ్బతిన్న వ్యాపారం

Published: Monday December 07, 2020

అమరావతికి అంకురార్పణ జరిగిందన్న ఆనందం à°† శాఖలో ఐదేళ్లు మాత్రమే కనిపించింది. కొత్త రాజధాని, సరికొత్త భవనాలు, ముమ్మురంగా సాగే బహుళ అంతస్తుల నిర్మాణాలు...వెరసి వ్యాపారం అదిరిపోతుందనుకుంది. ఆలోచన వచ్చిందే తడవుగా ఆగమేఘాల మీద వచ్చి విజయవాడలో వాలిపోయింది. కట్‌ చేస్తే ఇప్పుడు నిలబడిన చోట నుంచి కదిలిపోయే పరిస్థితి వచ్చింది. à°† సంస్థ పేరే భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌(బీఈఎంఎల్‌). రక్షణ శాఖకు అనుబంధంగా ఉండే మినీరత్న గుర్తింపు పొందిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇది. అమరావతి నిర్మాణానికి 2015 అక్టోబరులో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రాజధానిలో నిర్మాణమ య్యే భవనాలు, ఇతర ఐకానిక్‌ టవర్లను దృష్టిలో ఉంచుకుని బీఈఎంఎల్‌ రాజధాని ప్రాంతంలో అడుగుపెట్టింది. మెట్రో రైల్‌ ప్రాజెక్టు మంజూరు కావడంతో దానికి కోచ్‌లను సరఫరా చేస్తే మంచి వ్యాపారం నిర్వహించుకోవచ్చునన్న ఆలోచనతో విజయవాడలో 2016 జూన్‌లో బ్రాంచ్‌ ఏర్పాటు చేశారు. ఏజీఎం, సేల్స్‌ మేనేజర్‌, అకౌంటెంట్‌, ఇద్ద రు క్లర్క్‌లతో à°ˆ బ్రాంచ్‌ పనిచేస్తోంది. పెద్దపెద్ద ప్రాజెక్టులను నిర్మిస్తున్న ఇంజనీరింగ్‌ కంపెనీలు, సిమెంట్‌ ఫ్యాక్టరీలు à°ˆ కంపెనీ నుంచి కొనుగోళ్లు సాగిస్తున్నాయి. ఏడాదికి 10-15 బుల్‌డోజర్లు, పొక్లయిన్‌లను రాష్ట్రంలోని వివిధ సంస్థలకు బీఈఎంఎస్‌ విక్రయిస్తోంది. ఏటా రూ.10 కోట్లు నుంచి 15 కోట్లు వ్యాపారం దాదాపు మూడున్నరేళ్లపాటు జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని విషయంలో మొదలైన 3 ముక్కల ఆటతో à°ˆ బ్రాంచ్‌కూ భవిష్యత్తు దారులు మూసుకుపోయాయి. వైసీపీ సర్కారు వైఖరితో ఎక్కడి నిర్మాణాలు అక్కడ ఆగిపోయాయి.

 

 à°¦à±€à°‚తో ప్రస్తుతం వా ర్షిక ఆదాయం సగానికి సగం పడిపోయింది. వ్యాపారం రూ. 8కోట్లు దాటడం లేదు. à°ˆ క్రమంలో బీఈఎంఎల్‌లోని ఉన్నతస్ధాయి అధికారులు.. à°ˆ బ్రాంచ్‌ను వేరే ప్రాంతానికి తరలించే ప్రణాళికను అమలుచేయడం ప్రారంభించారు. దీనికితోడు.. ప్ర తిష్ఠాత్మక సంస్థలను, కేంద్ర సంస్థలను రాజధాని ప్రాంతం నుంచి వెళ్లగొట్టేలా ప్రభుత్వ విధానాలు ఉండటం à°ˆ తరలింపుపై అనుమానాలను పెం చుతున్నాయి. విజయవాడ బ్రాంచ్‌ ఏజీఎం వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరున ఉద్యోగ విరమణ చే యనున్నారు.  కొద్దిరోజుల క్రితం à°’à°• క్లర్క్‌ను కొత్తగూడెం బదిలీపై పంపేశారు. ఇక నలుగురు మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి భవనాన్ని ఖాళీ చేస్తామని సంస్థ ప్రతినిధులు యజమానికి à°—à°¤ నెల 24à°µ తేదీన నోటీసు ఇచ్చారు. à°ˆ బ్రాంచ్‌ను విశాఖపట్నం బ్రాంచ్‌లో విలీనం చేయడానికి ప్రణాళికలను గోప్యంగా రూపొందిస్తున్నారు.