తప్పనిసరి బదిలీల సంఖ్యతో సమానంగా బ్లాక్‌చేసిన వైనం

Published: Monday December 07, 2020

బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయలోకానికి పాఠశాల విద్యాశాఖ షాక్‌ ఇచ్చింది. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను బదిలీల్లో చూపకుండా బ్లాక్‌ చేసింది. నిబంధనలమేరకు తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్ల సంఖ్యకు సమానంగా వేలాది ఖాళీలను బ్లాక్‌లో పెట్టింది. ఫలితంగా కోరుకున్న పాఠశాలకు బదిలీ అయ్యేందుకు ఉపాధ్యాయులకు ఉండే మార్గం మూసుకుపోయింది. పెద్ద స్కూళ్లలో విద్యార్థుల అవసరాలకు తగినంతమంది టీచర్లు లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది.

రాష్ట్రంలో సింగిల్‌ టీచర్‌ స్కూళ్లు లేకుండా చర్యలు తీసుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ చెప్పినప్పటికీ, ఖాళీలను బ్లాక్‌చేయడం వల్ల భవిష్యత్తులోనూ à°ˆ వ్యవస్థే కొనసాగే పరిస్థితి నెలకొంది. ఖాళీలన్నింటినీ చూపినట్లయితే మారుమూలన ఉన్న పాఠశాలలకు ఎవరూ వెళ్లరని, తద్వారా ఆయా స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతుందని విద్యాశాఖ తన చర్యను సమర్థించుకొంటోంది. విద్యార్థులకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే ఖాళీలన్నింటినీ చూపకుండా బ్లాక్‌ చేయాలని ఆదేశించారని చెబుతోంది. 

 

మారుమూలన ఉన్న పాఠశాలలు మూతపడకుండా ఉండాలంటే à°ˆ నిర్ణయం మంచిదే. అయితే, ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఉన్నతస్థాయి నుంచి వచ్చిన మార్గదర్శకాలు జిల్లాల్లో అమలుకావడం లేదని చెబుతున్నారు. విద్యాశాఖాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, ఒక్కో జిల్లాలో ఒక్కో విఽధంగా ఖాళీలను ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. ఖాళీలను బ్లాక్‌ చేసే విషయంలో పైరవీలకు ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. దొడ్డిదారి బదిలీ కోరుకునే వాళ్లు నగరాలకు, పట్టణాలకు సమీపంలోని ఖాళీలను బ్లాక్‌ చేయించుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల ప్రక్రియ పూర్తి కాగానే ఇప్పుడు బ్లాక్‌ చేసిన ప్రదేశాల్లోకి రావచ్చన్న ప్లాన్‌తో కొందరు రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తున్నారు