ఎవరెస్ట్ పర్వతం ఎత్తు ఎంతంటే

Published: Tuesday December 08, 2020

 à°ªà±à°°à°ªà°‚చంలో అత్యంత ఎత్తయిన పర్వతం ఎవరెస్ట్ ఎత్తును నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. తాజా లెక్కల ప్రకారం à°ˆ పర్వతం ఎత్తు 8,848.86 మీటర్లు ఉందని తెలిపింది. దీని ఎత్తును భారత ప్రభుత్వం 1954లో కొలిచినపుడు 8,848 మీటర్లు అని నిర్థరణ అయింది. ప్రపంచవ్యాప్తంగా దీనినే విస్తృతంగా ఆమోదిస్తున్నారు. 

 

ఎవరెస్ట్ పర్వతం ఎత్తును 1954లో సర్వే ఆఫ్ ఇండియా కొలిచింది. దీని ఎత్తు 8,848 మీటర్లు అని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా దీనినే ఆమోదిస్తున్నారు. నేపాల్, చైనా తాజాగా ఈ పర్వతం ఎత్తును కొలిచాయి. దీని ఎత్తు 0.86 మీటర్లు పెరిగిందని, 8,848.86 మీటర్లకు చేరిందని ప్రకటించాయి. నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్, చైనా మంత్రి వాంగ్ యి వర్చువల్ కార్యక్రమంలో ఈ వివరాలను ప్రకటించారు.

 

2015లో హిమాలయ పర్వత ప్రాంతంలో విధ్వంసకర భూకంపం సంభవించిన నేపథ్యంలో ఎవరెస్ట్ పర్వతం ఎత్తు మారే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయపడటంతో, నేపాల్ ప్రభుత్వం రెండేళ్ళ క్రితం à°ˆ పర్వతాన్ని కొలిచే కార్యక్రమాన్ని చేపట్టింది. నేపాల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సర్వే దీనిని కొలిచింది. à°ˆ కార్యక్రమంలో నేపాల్, చైనా అధికారులు పాల్గొన్నారు. à°ˆ కొలతల కార్యక్రమంలో పాలుపంచుకున్నవారిని త్వరలో సత్కరించనున్నట్లు నేపాల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సర్వే ప్రకటించింది.