ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన ఫలితమిది

Published: Tuesday December 08, 2020

 à°œà°—న్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి కూర్చుందని, à°† పాపం ఫలితంగానే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వందలమంది ఆస్పత్రుల పాలవుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పాలనను తేలిగ్గా తీసుకొని వ్యవస్థలను కుప్పకూలుస్తున్నారని, పర్యవేక్షించేనాథుడు లేక ప్రతిచోటా సమస్యలు పుట్టుకొస్తున్నాయన్నారు. చేయాల్సిన పని వదిలేసి టీడీపీ నేతలను తిట్టడం ఒక్కటే కార్యక్రమంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విలేకరులతో మాట్లాడారు. అన్ని పరీక్షలు చేశామని, అన్నీ బాగానే ఉన్నాయని ప్రభుత్వ పెద్దలు బుకాయిస్తున్నారన్నారు.

 

ఏలూరు నగరంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే మునిసిపల్‌ శాఖ మంత్రి ఏమయ్యారో  తెలియదని, అసెంబ్లీలో ప్రతిపక్షంపై గొంతు చించుకొని ఉపన్యాసాలు చెప్పే మంత్రులు ప్రజలకు ఆపద వచ్చినప్పుడు మాత్రం à°•à°‚à°Ÿà°¿à°•à°¿ కనిపించడం లేదని చంద్రబాబు విమర్శించారు. ఏలూరులో తాగు నీరైనా కలుషితం అయి ఉండాలి లేదా పారిశుద్ధ్య సమస్య అయినా తలెత్తి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి పెళ్లికి వెళ్తూ మధ్యలో బాధితులను పరామర్శించడం దారుణం. పెళ్లి చేసుకొన్న వారిని తర్వాత తన ఇంటికి పిలిపించుకొని అయినా ఆశీర్వదించవచ్చు.కానీ మొదటి ప్రాధాన్యం ఏలూరు సంఘటనకు ఇస్తే బాగుండేది. దేనిపైనా సీరియ్‌సనెస్‌ లేదని అనడానికి ఇదే నిదర్శనం. విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ సంఘటన, గోదావరిలో పడవ ప్రమాదం జరిగితే ఒకరోజు హడావుడి తప్ప తర్వాత వారిని పట్టించుకొన్న నాథుడు లేడు. అదే తంతు ఏలూరులోనూ కనిపిస్తోంది’ అని చంద్రబాబు విమర్శించారు. జగన్‌ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని, దాని ప్రభావం ప్రతి రంగంపైనా పడి ప్రజలు అవస్థలు పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పంటల బీమా ప్రీమియం ప్రభుత్వాలు ఏటా చెల్లిస్తున్నాయి.

 

రైతులు తీసుకొన్న రుణం నుంచి కొంత భాగం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కొంత భాగం చెల్లిస్తూ వస్తున్నాయి. వీళ్లు వచ్చిన తర్వాత తామే బీమా కంపెనీ పెడతామని చెప్పి, తాము చెల్లించాల్సింది చెల్లించలేదు. పైగా ప్రీమియం కట్టేశామని అసెంబ్లీలో బుకాయించారు. మేం ధర్నా చేస్తే అదే రోజు అర్ధరాత్రి హడావుడిగా చెల్లించారు.’ అని ఆయన విమర్శించారు. ప్రజలపై ఆస్తి పన్ను రూపంలో వేల కోట్ల రూపాయలు కొత్తగా వడ్డించడానికి అసెంబ్లీలో బిల్లులు ఆమోదించుకొన్నారని చంద్రబాబు విమర్శించారు. ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని, తెచ్చిన వేల కోట్ల అప్పులన్నీ ఏం అవుతున్నాయని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఏలూరులో కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ పారిశుద్ధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వలేదని విమర్శించారు