చాలా తక్కువ సమయంలోనే అనూహ్యమైన అభివృద్ధి

Published: Wednesday December 09, 2020

దేశంలోనే తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, డైనమిక్‌లీడర్‌ కేసీఆర్‌ నేతృత్వంలో చాలా తక్కువ సమయంలోనే అనూహ్యమైన అభివృద్ధిని సాధించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమూశ్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ ఏర్పడిన ఆరు సంవత్సరాల్లో అమల్లోకి తీసుకు వచ్చిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌తో  దేశంలోనే మొదటి ర్యాంక్‌లో నిలిచిందన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 64 దేశాలకు చెందిన రాయబారులు, హై కమిషనర్లు బుధవారం హైదరాబాద్‌కు వచ్చారు. వారికి తెలంగాణ తరపున ఆతిధ్యాన్ని ఇచ్చారు. ఈసందర్భంగా విదేశీ రాయబారుల బృందం నగరంలోని రెండు ప్రముఖ కంపెనీలు భారత్‌బయోటిక్స్‌, బయోలాజికల్‌à°ˆ సంస్ధలనుసందర్శించాయి. సందర్భంగా సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ వారికి స్వాగతం పలికారు. 

 

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని పలు ప్రముఖ కంపెనీలు ముఖ్యంగా గూగుల్‌, యాపిల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్ధలు హైదరాబాద్‌లోనూ తమ శాఖలను ఏర్పాటు చేశాయని అన్నారు. పార్మాసెక్టార్‌ను కూడా ఇక్కడ అభివృద్ది చేస్తున్నామని, 50 బిలియన్ల యూఎస్‌ డాలర్లతో ఫార్మారంగం అభివృద్ది జరుగుతోందన్నారు. వ్యాక్సిన్‌ హబ్‌à°—à°¾ హైదరాబాద్‌ ప్రసిద్ది పొందిందన్నారు. దాదాపు 33 శాతం వ్యాక్సిన్‌ ఉత్పత్తి హైదరాబాద్‌లో జరుగుతోందన్నారు. తెలంగాణలో పరిశ్రమల స్ధాపనకు వేగంగా అనుమతి మంజూరు చేసేందుకు ప్రభుత్వం టీఎస్‌ ఐపాస్‌ ద్వారా అనుమతి ఇస్తున్నదని చెప్పారు. 

 

ఇలాంటి కొత్త పాలసీలతో ఆరు సంవత్సరాల కాలంలో భారీగా 14వేల యూనిట్‌లు ఇక్కడ ఏర్పాటయ్యాయని తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తున్నకరోనాకు వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న భారత్‌బయోటెక్స్‌, బయోలాజికల్‌à°ˆ వంటి సంస్థల పనితీరును ఆయా దేశాలకు చెందిన రాయబారులు పరిశీలించారు. నగరానికి వచ్చిన విదేశీరాయబారులను రెండు బృందాలుగా చేసి మొదటి బ్యాచ్‌ భారత్‌బయోటెక్‌, మరో బ్యాచ్‌ బయోలాజికల్‌ à°ˆ సందర్శించాయి. అలాగే తర్వాత మొదటి బ్యాచ్‌ బయోలాజికల్‌à°ˆ, రెండో బ్యాచ్‌ భారత్‌బయోటెక్‌ సంస్థలను సందర్శించాయి. 

 

ఈసందర్భంగా పరిశ్రమలు, ఐటీ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌ మాట్లాడుతూ నగరానికి వచ్చిన విదేశీ ప్రతినిధులకు తెలంగాణలో పరిశ్రమల స్ధాపన, ప్రస్తుతం కొనసాగుతున్న పరిశ్రమల తీరుపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చినట్టు తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఫార్మాసిటీ మరో రెండు నెలల్లోనే కార్య కలాపాలను ప్రారంభిస్తుందని అన్నారు. ఓఆర్‌ఆర్‌కు సమీపంలో 500 ఎకరాల్లో మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.