పరిశోధన సంస్థ భూమి వైద్య కాలేజీకి

Published: Friday December 11, 2020

చరిత్రను పట్టించుకోలేదు. చేపడుతున్న విలువైన పరిశోధనలను పరిగణనలోకి తీసుకోలేదు. నిపుణుల అభ్యంతరాలు, స్థానికుల ఆందోళనలు లక్ష్యపెట్టలేదు. అనుకొన్నట్టే.. నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి విలువైన భూములను లాగేసుకొన్నారు. à°ˆ మేరకు కొత్త మెడికల్‌ కాలేజీ కోసం యాభై ఎకరాలను సేకరిస్తున్నామని ఇటీవల జీవోను కూడా విడుదల చేశారు. ఇంకా దారణం ఏమిటంటే, à°† యాభై ఎకరాలు వ్యవసాయ కేంద్రం నుంచి సేకరించినట్టు మాత్రం à°† జీవోలో ఎక్కడా లేదు. à°ˆ వ్యవహారంలో తొలినుంచీ రాష్ట్ర ప్రభుత్వం గోప్యత పాటిస్తోంది. జీవో జారీలోనూ అదే ‘జాగ్రత్త’ తీసుకొంది. వ్యవసాయకేంద్రం ప్రస్తావన ఎక్కడా లేకుండా... కేవలం వ్యవసాయ భూమిని సేకరించినట్టు మాత్రం పేర్కొన్నారు. మొత్తం 11 సర్వే నంబర్లలో à°ˆ భూములు సేకరించి, జీవోలో మాత్రం నూనెపల్లె గ్రామంలోని ఒక్క సర్వేనంబరునే (244-ఏ ఈటీసీ) పలకరించి..అందులోనే భూములు కేటాయిస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం! 

 

నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానాన్ని (ఆర్‌ఏఆర్‌ఎస్‌) కదిలించొద్దని, అందులోని భూములను సేకరించవద్దని శాస్త్రవేత్తలు, స్థానికులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. కొత్త వంగడాల సృష్టిలో దేశంలోనే ఏ-1 గ్రేడ్‌ స్థాయిలో నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రసిద్ధి గాంచింది. కొత్త పంటలు, సమగ్ర సస్యరక్షణ చర్యలపై దశాబ్దాలుగా పరిశోధనలు సాగుతున్నాయి. ఇక్కడ à°Žà°•à°°à°‚ భూమి రూ.10 కోట్లకుపైగానే ఉంది. దీంతో జిల్లా పునర్వ్యవస్థీకరణ à°•à°¿à°‚à°¦ నంద్యాలకు వచ్చే కొత్త కలెక్టరేట్‌, మెడికల్‌ కాలేజీని కేంద్రం భూముల్లో నెలకొల్పేలా ప్రభుత్వ పెద్దల వద్ద వారు పావులు కదిపారు. à°ˆ క్రమంలో జరిగిన మంత్రివర్గ సమావేశం.. మెడికల్‌ కాలేజీ కోసం యాభై ఎకరాలను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. అప్పటినుంచి à°ˆ కేంద్రంలో పనిచేసే కార్మికులు దీక్షలు సాగిస్తున్నారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది.  ఇంతలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో నం. 341 విడుదల చేసింది. à°ˆ జీవోలో భూమి విస్తీర్ణం, సర్వేనంబర్లు, ఇవి ఆర్‌ఏఆర్‌ఎస్‌ పరిధిలో à°Žà°‚à°¤ విస్తీర్ణం, రైతు శిక్షణా కేంద్రం (ఎఫ్‌టీసీ) పరిధిలో à°Žà°‚à°¤ విస్తీర్ణం అన్న విషయం స్పష్టం చేయలేదు. ఎక్కడ నుంచి తీసుకొన్నారు.. అది ఎలాంటి భూమి అనేది వివరించలేదు.