రైతుల ఆదాయం పెంపునకు తోడ్పడండి

Published: Saturday December 12, 2020

సమాజంలోని అన్నివర్గాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరారు. అర్హులకు బ్యాంకులు ఇచ్చే రుణాలకు సంబంధించిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ‘‘2020-21లో స్వయం సహాయక సంఘాలు తమ ఖాతాల్లో రూ.7,500కోట్లు జమచేశాయి. వాటికి బ్యాంకులు ఇస్తున్న వడ్డీ కేవలం 3 శాతం మాత్రమే. కానీ అవే బ్యాంకులు రుణాలపై 11 శాతం నుంచి 13 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి’’ అని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో 213à°µ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తున్న లబ్ధిదారుల తరఫున వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్ని బ్యాంకులు పరిగణనలోకి తీసుకోవాలని సీఎం కోరారు. ‘‘మహిళలు, చిరువ్యాపారులు, రైతులు, కౌలు రైతులకు విరివిగా రుణాలివ్వాలి. సున్నావడ్డీ, వైఎస్సార్‌ చేయూత, ఆసరా, జగనన్నతోడు, టిడ్కో ఇళ్ల నిర్మాణం వంటి ప్రభుత్వ పథకాలకు పూర్తి సహాయ,సహకారం అందించాలి’ అని ఆయన బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. ‘‘రైతు భరోసా à°•à°¿à°‚à°¦ ఇచ్చే రూ.13,500.. రైతులకు 80శాతం పెట్టుబడి వ్యయంగా ఉపయోగపడుతుంది. వడ్డీలేని రుణాలకు గతంలో ఎగ్గొట్టిన అన్ని బకాయిలు పూర్తిగా చెల్లించాం. పంటల బీమా ప్రీమయంకూడా రైతులకు భారం కాకుండా చేశాం. దీనివల్ల పంటలకు భద్రత ఏర్పడింది. రైతులను చేయిపట్టుకుని రైతుభరోసా కేంద్రాలు నడిపిస్తాయి. ప్రభుత్వచర్యలతో రైతులు వాళ్ల కాళ్ల మీద వారు నిలబడేలా చేస్తున్నాం’’ అని వివరించారు.

రైతు ఆదాయం ఎలా రెట్టింపు అవుతుందన్న దానిపై à°’à°• ప్రభుత్వమేకాదు, బ్యాంకులు కూడా దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ కోరారు. ‘‘విపత్తులు వచ్చినప్పుడు రైతులను బ్యాంకులు ఆదుకోవాలి. కౌలురైతులకు రుణాలివ్వడంలో మరింతగా ముందుకు రావాలి. సాగుదారు హక్కు పత్రాలిచ్చాం కనుక రుణాల మంజూరులో బ్యాంకులు చొరవ చూపాలి’’ అని కోరారు. చిరువ్యాపారులు అధిక వడ్డీలకు రుణాలు తీసుకోకుండా ‘జగనన్న తోడు’ à°•à°¿à°‚à°¦ రూ.10వేలు వడ్డీ లేని రుణాలిస్తున్నామని, వారికి బ్యాంకులు రుణాలిస్తే à°† వడ్డీలు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. à°† వడ్డీలకు ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుందని చెప్పారు. ‘‘ఆర్థిక వ్యవస్థలో కీలకంగా నిలిచే ఎంఎ్‌సఎంఈ రంగానికి బ్యాంకులు తోడ్పాటు అందించాలి. అప్పుడే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. వారికి తిరిగి రుణాలివ్వడంలోను బ్యాంకులు ఉదారత చూపాలి. 2014నుంచి ఎంఎ్‌సఎంఈ పరిశ్రమలకు ఎగ్గొట్టిన రాయితీలు రూ.1,100కోట్లు చెల్లించాం. ఆసరా,చేయూత పథకాల ద్వారా మహిళల స్వయం సాధికారితకు అడుగులేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇస్తున్నాం.

 

à°† డబ్బు ప్రభుత్వం ఇచ్చే సొమ్ముకు గ్యారంటీగా బ్యాంకర్లు పరిగణనలోకి తీసుకోవాలి. à°† మహిళలకు à°…à°‚à°¡à°—à°¾ నిలిచేలా అమూల్‌, అల్లానా, ఐటీసీ, ప్రాక్టర్‌అండ్‌ గాంబల్‌, హెచ్‌యూఎల్‌, రిలయన్స్‌ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. మహిళలు ఎంపిక చేసుకున్న వ్యాపారాలకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలి. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల పంపిణీకి షెడ్యూల్‌ ఇచ్చాం. షెడ్యూల్‌ ప్రకారం సహాయం అందించేలా బ్యాంకర్లు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి’’ అని సూచించారు. కాగా, టిడ్కో ఇళ్లను వీలైనంతత్వరగా పూర్తిచేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందని సీఎం జగన్‌ అన్నారు. ‘‘మొత్తం 2.69లక్షల టిడ్కో యూనిట్లను 2021 డిసెంబరు, 2022డిసెంబరులో విడతల వారీగా పూర్తి చేస్తాం. దీనికి బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించాలి’’ అన్నారు. కాగా, రాష్ట్రంలో సెప్టెంబరు నాటికి ప్రాధాన్యరంగంలో రూ.2.80లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.1.85లక్షల కోట్లు (42.61ు) రుణాలిచ్చినట్లు యూబీఐ à°Žà°‚à°¡à±€ రాజ్‌కిరణ్‌రాయ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చెప్పారు.