పోలవరంపై ఎన్నికలనాటి జగన్‌ హామీల అమలేదీ?

Published: Monday December 14, 2020

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు వివాదం à°“ పక్క కొనసాగుతుండగానే.. మరోపక్క నిర్వాసితులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం క్రమంగా స్వరం పెంచుతున్నారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి à°ˆ ప్రాజెక్టు à°•à°¿à°‚à°¦ భూములు కోల్పోయే రైతులకు పెద్దఎత్తున పరిహారం చెల్లిస్తామని చెప్పి.. ఎకరాకు రూ.లక్షా 15 వేల నుంచి లక్షా 45 వేల వరకూ చెల్లించారు. నిరుడు ఎన్నికలకు ముందు నాటి విపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్మోహన్‌రెడ్డి నిర్వాసితులకు అనేక వరాలిచ్చారు. తాను గద్దెనెక్కితే ఎకరాకు రూ.5 లక్షలు పరిహారంగా ఇస్తానని పదేపదే చెప్పారు. అలాగే వ్యక్తిగత పరిహారం à°•à°¿à°‚à°¦ రూ.పది లక్షలు చెల్లిస్తానన్నారు. స్థానిక వైసీపీ నేతలు కూడా ఊరూరా ఆయన హామీలను ప్రచారం చేశారు. అయితే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు గానీ.. ఇచ్చిన హామీలు మాత్రం ఆచరణలోకి రాలేదు. తమకు ఆశ చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందారని.. అధికారంలోకి వచ్చాక నోరు మెదపడం లేదని నిర్వాసితులు ఆగ్రహంతో ఉన్నారు. ఇదెక్కడి న్యాయమని నిలదీస్తున్నారు. వాస్తవానికి ప్రాజెక్టు ద్వారా సర్వం కోల్పోతున్న కుటుంబాలకు వ్యక్తిగత పరిహారాన్ని గతంలోనే నిర్దేశించారు. భూములు కోల్పోయిన గిరిజనులకు ఒక్కో కుటుంబానికి రూ.5.85 లక్షలు, గిరిజనేతరులకు 5.35 లక్షల చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు. వాటి కోసం పదేపదే నిర్వాసితులు రోడ్డెక్కుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. కనీసం నిర్వాసితుల జాబితాలను కూడా బహిర్గతం చేయడం లేదు. అధికారులు ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. à°ˆ పరిస్థితుల్లో సీఎం జగన్‌ సోమవారం పోలవరం పనుల పరిశీలనకు ప్రాజెక్టు ప్రాంతానికి రానున్నారు. దీంతో నిర్వాసితులందరూ ఏకమై గళమెత్తుతున్నారు. తమకు న్యాయబద్ధంగా రావలసిన వ్యక్తిగత పరిహారం సంగతి అటో ఇటో తేల్చాలని పట్టుబడుతున్నారు. ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన తామంటే ఇంత చులకనా అని ప్రశ్నిస్తున్నారు. తమకు పరిహారం చెల్లించాకే ప్రాజెక్టు కట్టుకోవాలని తేల్చిచెబుతున్నారు. వీరికి గిరిజన సంఘాలు, వామపక్షాలు బాసటగా నిలిచాయి. ప్రభుత్వం మాత్రం à°ˆ విషయంలో నోరుమెదపడం లేదు. సంబంధిత అధికారులు సైతం పరిహారం సంగతి ప్రస్తావించడానికి సిద్ధపడడంలేదు.