గంజాయి స్మగ్లింగ్‌ కేసులో ఏపీ పోలీసుల పేర్లు

Published: Wednesday December 16, 2020

 à°—ంజాయి స్మగ్లింగ్‌ కేసులో ఏపీ పోలీసుల పేర్లు ఉన్నట్లు ఆబ్కారీ పోలీస్‌శాఖ పేర్కొంది. ఉప్పల్‌లో గంజాయి స్మగ్లింగ్‌ కేసులో హిందూపురం టూటౌన్‌ సీఐ శ్రీరామ్‌ పేరు ఉన్నట్లు తెలిపింది. ఏపీ పోలీస్‌ స్టిక్కర్‌ ఉన్న కారులో రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, అనంతపురం జిల్లా ఏఆర్‌ కానిస్టేబుల్‌ మోహన్‌ కృష్ణ సహా మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు ఆబ్కారీ పోలీస్‌శాఖ తెలిపింది. సీఐ శ్రీరామ్‌ పాత్రపై విచారణ జరుపుతున్నామన్నారు.