జనవరి, ఫిబ్రవరిలో ఉద్యోగులంతా టీకాల పనిలోనే బిజీగా ఉంటారు

Published: Wednesday December 16, 2020

వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు అవకాశం ఉందని, à°† సమయంలో ప్రభుత్వ ఉద్యోగులంతా తీరిక లేకుండా ఉంటారని.. à°ˆ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది. అందువల్ల à°—à°¤ నెల 17à°µ తేదీన పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను నిలుపుదల చేయాలని హైకోర్టును అభ్యర్థించింది. à°ˆ మేరకు మంగళవారం అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. à°ˆ ప్రొసీడింగ్స్‌ను ఆపాలని ఇప్పటికే పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. à°ˆ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ డీవీవీఎస్‌ సోమయాజులు ముందు మంగళవారం మరోసారి విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది సి.సుమన్‌ వాదనలు వినిపించారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను కోర్టుకు వివరించారు. ‘రాష్ట్ర స్థాయిలో స్టీరింగ్‌ కమిటీతో పాటు టాస్క్‌ఫోర్స్‌, కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. 

 

జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ స్థాయి అధికారి, అలాగే బ్లాక్‌ లెవల్‌లో సబ్‌ కలెక్టరు, తహశీల్దారు, పీడీవో స్థాయి అధికారులు నేతృత్వం వహిస్తారు. ఆన్‌లైన్‌లో రిజిస్టరైన వారి సంఖ్యను బట్టి రాష్ట్రప్రభు త్వం వ్యాక్సినేషన్‌కు ప్రణాళిక రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఒక్కో కేంద్రంలో à°’à°• విడతలో వంద మందికే వ్యాక్సిన్‌ ఇవ్వాలి. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ నిర్దిష ప్రదేశాల్లో వ్యాక్సిన్‌ ఇస్తారు. అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో వివిధ విడతల్లో వ్యాక్సిన్‌ ఇవ్వడంతో పాటు అదనపు కేంద్రాలను ఏర్పా టు చేయాలి. ఎన్నికల ప్రక్రియ జరిపిన విధంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్ర మార్గదర్శకాల్లో ఉంది. ఎన్నికల ప్రక్రియలో మాదిరిగానే.. ఇందులో పంచాయతీరాజ్‌, గ్రా మీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, విద్యాశాఖ ఉద్యోగులు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్‌ సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా.. వాటి నిల్వ, రవాణా, డెలివరీలో పోలీసులు కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.

 

మొదటి విడతలో వ్యాక్సిన్‌ వేయించుకునేవారిలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌, ఆరోగ్య సిబ్బంది, 50 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఉంటారు. వీరందరూ లక్షల్లో ఉంటారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొద à°Ÿà°¿ విడత వ్యాక్సినేషన్‌ ఉండే అవకాశం ఉంది. వ్యాక్సిన్‌ వే యించుకున్నవారికి మళ్లీ 4 వారాల తర్వాత రెండోసారి ఇవ్వాల్సి ఉంటుంది’ అని వివరించారు. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ అదనపు అఫిడవిట్‌పై సవివరంగా కౌంటర్‌ దాఖలు చేసేందు కు సమయం కావాలని అభ్యర్థించారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు