ఎగసిపడుతున్న రాజధాని పోరాటం

Published: Thursday December 17, 2020

రాజధాని ఉద్యమం ఉప్పెనల్లే ఏడాదిగా ఎగిసి పడుతోంది. పోలీసుల లాఠీ దెబ్బలకు వెరవలేదు. అక్రమ కేసులు బనాయించినా, జైళ్లలో పెట్టినా కుంగిపోలేదు. చివరకు కరోనా కాలంలోనూ కాళ్లు ఇంట్లో పెట్టుకోలేదు. పోటీ ఉద్యమాల కవ్వింపులపై రెచ్చిపోలేదు. ‘అమరావతి ఏకైక రాజధాని’ అనే ఏకైక నినాదమే శాంతియుత మంత్రంగా à°ˆ సంవత్సరమంతా పఠిస్తూనే ఉన్నారు. సరిగ్గా ఏడాది క్రితం అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్‌ అమరావతి ఉసురు తీసేలా మూడు రాజధానుల ప్రకటన చేశారు. ఆరోజు ఆయన చేసిన ప్రకటన ఊరు,వాడను ఉద్యమవేదికపై ఏకంచేసింది.

 

అప్పటినుంచి రాజధానిలోని 29 గ్రామాలు ఉద్యమ బాట పట్టి కదం తొక్కుతున్నాయి. à°ˆ క్రమంలో ఉద్యమంపై ఎన్నో దౌర్జన్యాలో, మరెన్నో దారుణాలో! అర్ధరాత్రిళ్లు పోలీసులు తలుపు తట్టి ఉద్యమంలో పాల్గొంటున్న రైతులను అరెస్టు చేశారు. సమరశీలంగా పోరాడుతున్న మహిళా రైతులను à°† స్టేషన్‌, à°ˆ స్టేషన్‌ అని ఎక్కడెక్కడికో తిప్పారు. à°—à°¤ ఏడాది డిసెంబరు నెలలో ప్రారంభమైన అమరావతి ఉద్యమం ఏ ఒక్క రోజూ విశ్రమించలేదు. తొలుత మూడు గ్రామాలు మందడం, వెలగపూడి, తుళ్లూరులో ప్రారంభమైన ఉద్యమం కొద్ది రోజుల్లోనే రాజధానిలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. à°† తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లాలను కదిలించింది. క్రమేపి రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా రూపాంతరం చెందుతోంది. 

 

సమరాంగణంలో సివంగులై..

మూడు రాజధానుల ప్రకటన నాటికి రాజధానిలో ఇంచుమించుగా రూ. 20 వేల కోట్ల విలువ చేసే పనులు ప్రారంభమై తుది దశకు చేరుకొన్నాయి. ఎంతోమందికి స్థానికంగా ఉపాధి, ఉద్యోగాలు లభించాయి. ప్రపంచంలోని ఐదు మేటి నగరాల్లో అమరావతిని ఒకటిగా తీర్చిదిద్దేందుకు బృహత్తరమైన ప్రణాళిక రూపొందించి ఆ దిశగా అడుగులు పడ్డాయి. ఇందులో రైతులదే కీలక భూమిక. రాజధాని కోసం తమ భూములు ప్రభుత్వానికి ఇచ్చేటప్పుడు వారు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తమ పిల్లలతో పాటు రాష్ట్రంలో అందరి పిల్లల భవిష్యత్తు బంగారం అవుతుందని మనస్సుకు తమకు తాము సర్దిజెప్పుకొన్నారు. ప్రభుత్వం తమతో చేసుకొన్న ఒప్పందం మేరకు అభివృద్ధి పనులు, భవంతుల నిర్మాణాలు సాగడంతో తమ త్యాగానికి ప్రతిఫలం దక్కుతుందని ఆశించారు.

 

ఇంతలో.. 2019లో ఎన్నికలు జరిగాయి. à°† ఎన్నికల తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే అమరావతికి మరణ శాసనం లిఖించింది. తొలుత రాజధానిలో పనులు నిలిపేసింది. à°† తరువాత ఏకంగా రాజధానినే ముక్కలు చేయాలని నిర్ణయించింది. దీనిపై ఉద్యమం రాజుకొంది. ఉద్యమం తొలి రోజుల్లో రోడ్ల పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో టెంట్లు వేసుకొన్నారు. కొద్ది రోజుల తర్వాత పోలీసులు అంగీకరించకపోవడంతో, రైతుల సొంత స్థలాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. పోరాటంలో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మని దర్శించుకునేందుకు బయలుదేరిన మహిళలని అత్యంత పాశవికంగా పోలీసులు అడ్డుకొన్నారు. à°—à°¤ ఏడాది జనవరిలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. మహిళలు పోలీసుల వలయాలను ఛేదించుకొంటూ ఎంపీ గల్లా జయదేవ్‌ సారధ్యంలో అసెంబ్లీ గోడలను తాకి తమ పోరాట పటిమని ప్రదర్శించారు. రాయపూడిలో దళిత, ముస్లిం మైనార్టీ మహిళలు ఉద్యమ శిబిరం ఏర్పాటు చేసి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.