వ్యాక్సిన్ పంపిణీకి స్థానిక ఎన్నికలు అడ్డురావు

Published: Thursday December 17, 2020

స్థానిక ఎన్నికలు నిలిపివేయాలని ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కౌంటర్‌ అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనా వ్యాక్సిన్ రావడానికి 3 నుంచి 6 నెలల సమయం పడుతుందని, ఇప్పటికిప్పుడు à°† వ్యాక్సిన్ రావడంలేదని ఎన్నికల కమిషన్‌ కోర్టుకు దృష్టికి తెచ్చింది. వ్యాక్సిన్‌ను ప్రాధాన్యతాక్రమంలో పంపిణీ చేస్తున్నారని, వ్యాక్సిన్ పంపిణీకి స్థానిక ఎన్నికలు అడ్డురావని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ఇప్పటికే బిహార్, రాజస్థాన్, హైదరాబాద్‌లో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించారని గుర్తు చేసింది. ఏపీలో ఎన్నికల నిర్వహణకు సానుకూల వాతావరణం ఉందని, అందరిని సంప్రదించిన తర్వాతే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. ఎన్నికలు వాయిదా వేయాలన్న ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేయాలని, తగిన ఆదేశాలివ్వాలని అఫిడవిట్‌లో ఏపీ ఎస్ఈసీ అభ్యర్థించారు.