చెరువులో ఇళ్ల స్థలాలు వద్దన్న లబ్ధిదారులు

Published: Sunday December 27, 2020

అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌ తరహాల్లో ఇళ్ల పట్టాల పంపిణీలో లబ్ధిదారులూ రివర్స్‌ గేర్‌ వేశారు. చెరువులో ఇళ్ల పట్టాలివ్వటంతో నీరు వచ్చినపుడు మునిగి, చావాలా అంటూ ఏకంగా ఇళ్ల పట్టాలనే వెనక్కిచ్చేశారు. దీంతో పట్టాలను పంపిణీ చేసిన వెంటనే అధికారులు, వైసీపీ నాయకులు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

చెరువులో ఇల్లు కట్టి చెడిపోవాలా అంటూ మండలంలోని అరమడకవారిపల్లిలో పట్టాలు తీసుకున్న లబ్ధిదారులు వెనక్కిచ్చేశారు. గాండ్లపెంట మండలం అరమడకవారిపల్లిలో పట్టాలు పంపిణీ చేసేందుకు వచ్చిన అధికారులకు లబ్ధిదారులు లేఅవుట్‌ వేసిన స్థలాన్ని చూసి, తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపిక చేసిన స్థలం చెరువులో ఉందనీ, నీరు వస్తే మునిగి పోతుందని సంబంధిత అధికారులకు మొదట్నుంచీ మొరపెట్టుకున్నా వినలేదన్నారు. గ్రామంలో 20 ఇళ్లకు సరిపడా అనువైన స్థలం ఉన్నా.. ఇంటి పట్టాలివ్వకుండా  చెరువులో ఇచ్చి అన్యాయం చేసేలా చూస్తున్నారని లబ్ధి దారులు సరస్వతి, హరినాథ్‌రెడ్డి, సుశీలమ్మ, గీత, రెడ్డెప్ప రెడ్డి అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు నీట మునగకుండా ఎత్తుచేసి, ఇంటి నిర్మా ణాలు చేపడతామని సర్దిచెప్పి పట్టాలు లబ్ధిదారులకు  అందించినా.. తమకు వద్దంటూ వెనక్కిచ్చేశారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక వెనుతిరిగి వచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటరమణ, ఎంపీడీఓ శ్రీరాములు, వైసీపీ మండల కన్వీనర్‌ చంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

రెవెన్యూ అధికారులు తమను నమ్మించి, మోసం చేశారని అనంతపురంరూరల్‌ మండలం కొడిమిలో ఇళ్ల పట్టాలకు భూములిచ్చిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కోసమని రెవెన్యూ అధికారులు కొడిమిలో 28 మంది రైతులకు సంబంధించిన 115 ఎకరాల భూమిని à°Žà°•à°°à°‚ రూ.28లక్షలతో తీసుకున్నారు. ఇందులో 42.63 ఎకరాలకు సంబంధించిన 14 మంది రైతులకు  పరిహారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. అదేమిటంటే à°† భూములకు పట్టాలు లేవనీ, ఎకరాకు రూ.14లక్షలు ఇస్తామని చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు తీసుకునేటపుడు ఎకరాకు రూ.28లక్షలు చెల్లిస్తామని ఆర్డీఓ నమ్మబలికి, ఇప్పుడు మాట మార్చటం సరికాదని రైతులు ఇబ్రహీం, సాంబశివ, నా గార్జున, జింకా సూర్యనారాయణ, లింగారెడ్డి, సూర్యనారాయణ, సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.