సౌర విద్యుత్‌ టెండర్లపై ఉత్కంఠ

Published: Friday January 01, 2021

కొత్త సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం పిలిచిన టెండర్ల గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగిస్తుందా లేదా అన్నదానిపై విద్యుత్‌వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పోటీ పెంచడానికి గడువు పొడిగిస్తారా లేక వచ్చిన వాటితో సరిపెట్టుకొని ముగిస్తారా అన్నదానిపై ప్రభుత్వ నిర్ణయం కోసం à°† వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికి వచ్చిన టెండర్లలో అస్మదీయ సంస్థలవే సింహ భాగం ఉండటంతో à°ˆ అంశం చర్చనీయాంశం అయింది. రాష్ట్రంలో కొత్తగా ఆరున్నర వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది.

 

వీటి దాఖలుకు à°ˆ నెల 28à°µ తేదీని గడువుగా నిర్ణయించారు. ఇందులో పెద్ద టెండర్లు రెండు కంపెనీల నుంచే వచ్చాయని సమాచారం. మొత్తం ఆరున్నర వేల మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు ‘అదానీ గ్రీన్‌ పవర్‌’ టెండర్‌ దాఖలు చేసింది. కడపకు చెందిన షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థ 5800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్‌ వేసింది. ఇవి కాకుండా, మరో మూడు టెండర్లు కూడా వచ్చినా అవి à°ˆ స్థాయిలో లేవు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ 1800 మెగావాట్లకు, టొరెంట్‌ పవర్‌ సంస్థ 300 మెగావాట్లకు, హెచ్‌ఈఎస్‌- ఎస్‌ఎ్‌సఐఎ్‌సపీఎల్‌ సంస్ధల కన్సార్షియం 600 మెగావాట్లకు టెండర్లు వేశాయి. వీటిలో à°·à°¿à°°à°¿à°¡à±€ సాయి సంస్థ దాఖలు చేసిన టెండర్‌ చర్చనీయాంశం అయింది. à°ˆ సంస్థ యజమాని నర్రెడ్డి విశ్వేశ్వర్‌రెడ్డి అధికార పార్టీ నేతలకు సన్నిహితునిగా రాజకీయవర్గాల్లో గుర్తింపు పొందారు.

 

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన సిఫారసుతో విద్యుత్‌ సంస్థల్లో కొందరు కీలక అధికారుల నియామకం జరిగిందని కూడా ప్రభుత్వ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఆయన సంస్థకు ఇంతకుముందు సౌర విద్యుత్‌ ప్లాంట్లు సొంతంగా ఏర్పాటుచేసిన అనుభవం లేదు.అయినా à°† సంస్థ ఏకంగా 5800 మెగావాట్ల మేర సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్‌ దాఖలు చేయడం à°† రంగంలోని సంస్థలకు విస్మయం కలిగించింది. కృష్ణపట్నం పోర్టు కొనుగోలు వ్యవహారం తర్వాత అదానీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు మధ్య సంబంధ బాంధవ్యాలు పెరిగాయి. ఇలా అస్మదీయ సంస్థలే à°ˆ టెండర్లలో ముందు ఉన్నాయన్న అభిప్రాయం విద్యుత్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది