నిధుల లేమితో ధాన్యం నగదు చెల్లింపుల్లో జాప్యం

Published: Sunday January 03, 2021

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పౌర సరసఫరాల సంస్థ కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో నగదు చెల్లించలేకపోతోంది. ఓవైపు సంస్థ అప్పులు, మరోవైపు కేంద్రం నుంచి నిధులు రాకపోవడం వంటి పరిణామాలు ధాన్యం రైతులకు ఇబ్బందిగా మారాయి. గతంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమచేసే విధానాన్ని అమలు చేశారు. 48 గంటల్లో కాకపోయినా రెండు మూడు రోజులు అటూ ఇటూగా రైతులకు నగదు అందేది. కానీ ఇటీవల సంభవించిన నివర్‌ తుఫాను నేపథ్యంలో కొనుగోళ్లలో కొన్ని సడలింపులు ఇచ్చినందున చెల్లింపు కాలాన్ని కూడా పది రోజులకు పెంచారు. అయినా à°† గడువులోనూ రైతులకు నగదు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఫలితంగా రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.2,150 కోట్లకు చేరాయి. ఇప్పటికే ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలావరకు రైతులు ధాన్యం విక్రయించగా అక్కడా అందరికీ నగదు జమ కాలేదు.

 

à°ˆ ఖరీ్‌ఫలో ఇప్పటివరకూ 2,20,139 మంది రైతుల నుంచి 17.39 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. దాని విలువ రూ.3,255 కోట్లు. అందులో ఇప్పటివరకూ 70 వేల మంది రైతులకు రూ.1,090 కోట్లు చెల్లించారు. ఇంకా లక్షన్నర మంది రైతులకు రూ.2,150 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో పది రోజుల కిందటి బకాయిలు దాదాపు 600 కోట్లు కాగా, మిగిలిన రూ.1500 కోట్లు పది రోజుల్లోపులోనే ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల శ్రీకాకుళం, విజయనగరం, ఇతర జిల్లాల్లో సేకరణ పెరిగింది. ఇప్పటికే  పౌర సరఫరాల సంస్థ రూ.26వేల కోట్లు అప్పులు చేయగా, మరో 5వేల కోట్లు పొందేందుకు ప్రభుత్వం ఇటీవల అనుమతి మంజూరు చేసింది. ఆమేరకు కొత్త అప్పుల సమీకరణకు పౌర సరఫరాల సంస్థ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అప్పు సమకూరితే వెంటనే బకాయిలు చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.