దాడులపై కేంద్రం జోక్యం చేసుకోవాలి.

Published: Tuesday January 05, 2021

ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే, వారి ప్రేరణతోనే రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో ఆరోపించింది. అందుకే 136 సంఘటనలు జరిగినా ఎక్కడా చర్యలు తీసుకోలేదని ఆక్షేపించింది. à°ˆ దాడుల ఘటనలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. క్రైస్తవ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న జగన్‌రెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారన్న నమ్మకం పోయినందువల్ల కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని.. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరింది. à°† పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో సోమవారమిక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. దోషులపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుని మెజారిటీ ప్రజల మనోభావాలను కాపాడాలని కోరుతూ గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వాలని, ఇదే డిమాండ్‌తో ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ బాధ్యులను కలిసి విజ్ఞప్తి చేయాలని సమావేశం నిర్ణయించింది. ప్రభుత్వం విఫలమైనందున ఆలయాల రక్షణకు ప్రజలే నడుం బిగించాలని పిలుపిచ్చింది. దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ సమావేశం ప్రత్యేక తీర్మానం ఆమోదించింది. ‘ముఖ్యమంత్రి జగన్‌, హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్‌ ముగ్గురూ క్రైస్తవులు.

 

à°ˆ ముగ్గురూ ఒకే మతం వారైనప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇతర మతాల వారి మనోభావాలు దెబ్బ తినే పరిస్థితులు ఏర్పడినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. కానీ రాష్ట్రంలో పరిస్థితులు దానికి పూర్తి విరుద్ధంగా నడుస్తున్నాయి’ అని వ్యాఖ్యానించింది. తొలి సంఘటన జరిగినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇన్ని దాడులు, విధ్వంసాలు జరిగి ఉండేవి కావని తెలిపింది. పొలిట్‌బ్యూరో సమావేశ తీర్మానాలు, నిర్ణయాలను మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, ఎల్‌.రమణ విలేకరులకు వివరించారు. 

హిందూ మత విశ్వాసాలు, హిందూ ధర్మంపై దాడి చేసే హక్కు జగన్‌కు ఎవరిచ్చారని కాల్వ ప్రశ్నించారు. ‘కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు పోతే.. ఆంజనేయస్వామి విగ్రహం చెయ్యి విరిగిపోతే వట్టి విగ్రహమే కదా అని హేళన చేశారు. దానివల్లే శ్రీరాముడి విగ్రహం తల నరికే పరిస్థితి వచ్చింది. à°† రోజే మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్‌, కొడాలి నాని వ్యాఖ్యలను ముఖ్యమంత్రి à°–à°‚à°¡à°¿à°‚à°šà°¿ ఉంటే అది ఆయన నిష్పాక్షికతను తెలిపేది. జగన్‌రెడ్డి తనకు నచ్చిన మతం పాటించవచ్చు. చంద్రబాబు తిరుమలకు వెళ్తే జగన్‌రెడ్డి తాను గెలవగానే జెరూసలెం వెళ్లి వచ్చారు.

 

మాకేం అభ్యంతరం లేదు. కానీ à°’à°• మతం వారి ఆలయాలపై పదేపదే దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? ఏం జరిగినా టీడీపీని నాలుగు తిట్లు తిడితే పనై పోయినట్లా’ అని ధ్వజమెత్తారు. ‘రామతీర్థంలో రాములవారి విగ్రహం తల నరికి పారేసిన మర్నాడు ముఖ్యమంత్రి à°† జిల్లాకు వెళ్లారు. à°† ఆలయాన్ని సందర్శించారా? చంద్రబాబు వెళ్లేవరకూ à°† జిల్లా మంత్రికి గానీ, à°† జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న దేవదాయ మంత్రికి గానీ అక్కడకు వెళ్లే తీరిక లేదా? ఎక్కడ గడ్డి పీకుతున్నారు.. ఏ గాడిదలు కాస్తున్నారు? ప్రజల్లో ఆగ్రహం ఉంది కాబట్టే చంద్రబాబు à°† ఆలయానికి వెళ్లినప్పుడు వారిలో విపరీతమైన స్పందన వచ్చింది. ప్రజలను రెచ్చగొట్టాలని వెళ్లిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా తిరిగి రావలసి వచ్చింది. ముఖ్యమంత్రి పంపిస్తేనే ఆయన అక్కడకు వెళ్లాడు. ప్రజలు తమ ఆగ్రహం చూపిస్తే దానికి, టీడీపీకి, చంద్రబాబుకు ఏమిటి సంబంధం? ఏం చేయాలో దిక్కుతోచక చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కళావెంకట్రావుపై కేసులు పెడుతున్నారు’ అని ఎద్దేవాచేశారు.