వేధింపుల నుంచి రక్షణ కావాలి రాష్ట్ర ఐపీఎస్‌ సంఘానికి ఏబీవీ లేఖ

Published: Wednesday January 06, 2021

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తనకు పోస్టింగ్‌ ఇవ్వడం లేదంటూ నిఘా విభాగం మాజీ చీఫ్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర ఐ పీఎస్‌ అధికారుల సంఘానికి లేఖ రాశారు. ఏదో విధంగా తనను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందని, తనకు à°…à°‚à°¡à°—à°¾ నిలవాలని విజ్ఞప్తి చేశారు.

ఐపీఎస్‌ అధికారిగా 30 ఏళ్ల సర్వీసులో తనపై కేసులు లేవని, ఐపీఎస్‌ అధికారుల సంఘం తనకు వెన్నుదన్నుగా ఉంటుందని భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఐపీఎస్‌ అధికారుల సం ఘం సర్వసభ్య సమావేశం ఏర్పాటుచేసి తన సమస్యను పరిష్కరించాలని కోరారు. à°ˆ మేరకు ఆయన ఐపీఎస్‌ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రైల్వే డీజీ ద్వారకా తిరుమలరావుకు రాసిన లేఖ మంగళవారం పోలీసులు, ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

 

జగన్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తనకు పోస్టింగ్‌ ఇవ్వలేదని, ఇదే విషయమై 2సార్లు ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదని ఏబీవీ తెలిపారు. ‘కేవలం ఆరోపణలతో అభియోగాలు మోపి 19 నెలలుగా పోస్టింగ్‌ లేకుండా చేశారు. గతంలో నిఘా విభాగానికి విదేశీ పరికరాల కొనుగోలుకు సంబంధించి ని రుడు ఫిబ్రవరి 2à°¨ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ నుంచి మెమో వచ్చింది. ఫిబ్రవరి 8 నుంచి ప్రభుత్వం నన్ను సస్పెన్షన్‌లోనే ఉంచింది’ అని పేర్కొన్నారు.

 

తనను సస్పెండ్‌ చేయడంతో క్యాట్‌ను ఆశ్రయించానని, హైకోర్టులో పిటిషన్‌ కూడా వేశానని గుర్తుచేశారు. సస్పెండ్‌ చేసిన పది నెలల తర్వాత తనపై ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జ్‌(అభియోగాలన నమోదు) జారీ చేశారని తెలిపారు. ‘ఏదో విధంగా నన్ను అరెస్టు చేసే ప్రయత్నాలు జరుగుతున్న సమాచారం ఉంది. క్రిమినల్‌ కేసు పెట్టే ప్రయ త్నం జరుగుతోంది. బెయిల్‌కు అవకాశం లేకుండా 48 à°—à°‚à°Ÿà°² పాటు జైల్లో పెట్టి à°† కారణంతో సస్పెండ్‌ చేసే కుట్ర జరుగుతోంది. à°ˆ అంశాలన్నీ సంఘంలో చర్చించాలి. సంఘం నాకు వెన్నుదన్నుగా ఉంటుందని భావిస్తున్నాను’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.