వీధి దీపాల’ బాధ్యత వలంటీర్లకే

Published: Saturday January 16, 2021

 à°—్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల నిర్వహణ బాధ్యతను వలంటీర్లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు à°ˆ బాధ్యత నిర్వహిస్తున్న ఏజెన్సీలు బాధ్యతల నుంచి తప్పుకోవడంతో à°ˆ నిర్ణయం తీసుకుంది. à°—à°¤ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఈఎ్‌సఎల్‌ సహకారంతో సుమారు 24 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేయించారు. ప్రైవే టు సంస్థలు వీటిని ఏర్పాటు చేయడంతోపాటు నిర్వహణ బాధ్యతను చేపట్టాయి. వాటికి ప్రతి మూడు నెలలకు ప్రభు త్వం చెల్లింపులు చేసేది. కానీ, ప్రభుత్వం మారిన తర్వాత à°† ఏజెన్సీలకు చెల్లింపులు నిలిచిపోయాయి. రూ.వంద కోట్ల వరకు ప్రభుత్వ బకాయి పడినట్లు సమాచారం. దీంతో సదరు ఏజెన్సీలు వీటి నిర్వహణను పట్టించుకోవడం మానేశాయి. నెలల తరబడి నిర్వహణ లేకపోవడంతో పెద్దసంఖ్యలో దీపా లు వెలగడం లేదు. దీనిపై ఫిర్యాదులు రావడంతో నిర్వహణ విధానం మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ఏజెన్సీలు కేవలం బల్బులు, ట్యూబ్‌లైట్లు, ఇతర పరికరాల సరఫరాకు మాత్రమే పరిమితం కావాలని, వాటిని అమర్చ à°¡à°‚, మరమ్మతులు వలంటీర్‌, సచివాలయ సిబ్బంది చేపడతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  ఫిర్యాదు à°…à°‚ దిన 48 గంటల్లోగా వాటిని మరమ్మతు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటుతోపాటు యాప్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ à°ˆ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించాలని పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకుండా సంబంధిత ఏజెన్సీలు విడి భాగాలను సరఫరా చేస్తాయా? అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి