త్వరలోనే కరోనా-19 వ్యాక్సిన్ ఎగుమతి

Published: Saturday January 16, 2021

భారతదేశం త్వరలోనే కరోనా-19 వ్యాక్సిన్ ఎగుమతి కార్యక్రమం ప్రారంభిస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. లక్నోలో కొత్తగా నిర్మించనున్న సెంట్రల్ కమాండ్ హాస్పిటల్‌కు శనివారంనాడు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. à°ˆ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే హాజరయ్యారు.

 

 

'రెండు దేశీయ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మరిన్ని కూడా వస్తున్నాయి. వ్యాక్సిన్‌ను పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే వ్యాక్సిన్ ఎగుమతిని ప్రారంభించాం. వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినోభవంతు అనే సిద్ధాంతాన్ని మనం బలంగా నమ్ముతాం. అశోక చక్రవర్తి కాలం నుంచి ఇప్పటి వరకూ మనుషులతో పాటు సర్వ జంతుజాలం పట్ల మనం కరుణ చూపిస్తున్నాం. à°† à°°à°•à°‚à°—à°¾ మనం ప్రతి ఒక్కరికీ సహాయపడతాం' అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారితో ఒక్క రోజులోనే రైళ్లు, విమానాలు, మార్కెట్లు, స్కూళ్లు, కార్యాలయాలతో పాటు ప్రతీదీ ముతపడుతుందని ఏ ఒక్కరూ ఊహించలేదని, అయితే మన ప్రధాని à°ˆ పరిణామాన్ని à°’à°• సవాలుగా తీసుకుని కరోనా మహమ్మారిని సమర్ధవంతగా ఎదుర్కొనేందుకు ప్రతి వారం రెండు మూడు సమావేశాలు జరిపారని అన్నారు. ఇన్‌ఫెక్షన్‌ను పరీక్షించేందుకు దేశంలో కేవలం రెండే లేబొరేటరీలు ఉన్నాయని, పీపీఈ కిట్ల కొరత, వెంటిలేటర్లు, మాస్క్‌à°² కొరత ఉండేదని, అయితే కేవలం ఆరు నెలల వ్యవధిలోనే మెడికల్ సేఫ్టీ కిట్లు ఎగుమతి చేయగలిగే స్థితికి మనం వచ్చామని చెప్పారు. ఈరోజు దేశంలో 1000 లోబొరేటరీలు ఉన్నాయని, ఇదేమంత చిన్న విషయం కాదని స్పష్టం చేశారు.

 

 

కరోనాకు పోరాటంలో ముందుడి పోరాడిన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, హాస్పిటల్ శానిటరీ వర్కర్లు అందరికీ తాను తలవంచి నమస్కరిస్తున్నానని రాజ్‌నాథ్ అన్నారు. ప్రమాదం పొంచి ఉందని తెలిసీ  వారు తమ విధులను నిర్వర్తించారని, సంక్షోభ సమయాల్లో సాటివారికి సాయపడేందుకు కుటుంబాలకు కూడా దూరంగా ఉంటూ వైద్యులు సేవలందించారని, వైద్యులంటే భగవంతుని ప్రతిరూపాలని రాజ్‌నాథ్ అభివర్ణించారు.