భారత్‌కు మరో సవాలు..!

Published: Monday January 18, 2021

చైనా మరోసారి బరి తెగించింది. విస్తరణవాదంతో చెలరేగుతున్న చైనా భారత భూభాగంలో à°“ గ్రామం నిర్మించిందనే వార్త జాతీయ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అరుణాచల్‌ప్రదేశ్ వద్ద సరిహద్దుకు 4.5 కిలోమీటర్ల లోపల భారత్ భూభాగంలో à°ˆ నిర్మాణాలు చేపట్టినట్టు సమాచారం. ఎగువ సుబన్ సిరి జిల్లాలోని వివాదాస్పద ప్రాంతంలో ఏకంగా 101 ఇళ్లు నిర్మించినట్టు తెలుస్తోంది. భారత్ భూభాగమైన à°ˆ ప్రాంతాన్ని చైనా అనేక మార్లు తమకు చెందినదేనంటూ ప్రకటించింది. గతంలో ఇక్కడ పలు మార్లు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.  చైనా à°ˆ గ్రామం నిర్మించినట్టు శాటిలైట్ చిత్రాల ఆధారంగా నిపుణులు చెబుతున్నారు. ఆగస్టు 2019 నాటి చిత్రాలతో పోలిస్తే.. గతేడాది నవంబర్‌లో à°ˆ ప్రాంతంలో ఏకంగా 101 నిర్మాణాలు కనిపించాయి. దీన్ని బట్టి గతేడాదే à°ˆ గ్రామం ఏర్పాటైనట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 

 

అయితే.. à°ˆ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టంగా ఖండించకపోవడం గమనార్హం. ‘సరిహద్దు వద్ద వివాదాస్పద ప్రాంతాల్లో చైనా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నదన్న వార్తలు మా దృష్టికి వచ్చాయి. అయితే..చైనా గతంలోనూ అనేక పర్యాయాలు ఇటువంటి చర్యలకు పూనుకుంది’ అని విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్ కూడా సరిహద్దు వెంబడి మౌలిక వసతులు అభివృద్ధి చేస్తోందని, సరిహద్దు ప్రాంతాలకు రోడ్డు నిర్మాణాం చేపడుతోంది. 

 

 

ఇక గతేడాది నవంబర్‌లోనే చైనా దురాక్రమణ చర్యల గురించి అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ టాపిర్ గావ్ హెచ్చరించారు. ఎగువ సుబన్ సిరి జిల్లా గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. తాజాగా మరోసారి à°ˆ విషయమై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇప్పటికీ అక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సరిహద్దుకు దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చైనా చొచ్చుకు వచ్చింది. నది వెంబడి వెళితే..à°ˆ విషయం స్పష్టమవుతుంది. స్థానికంగా లెన్సీ అని పిలిచే à°“ నది వెంబడి చైనా à°“ రోడ్డు కూడా నిర్మిస్తోంది’ అని సదరు ఎంపీ జాతీయ మీడియాతో తెలిపారు. 

 

 

‘à°ˆ గ్రామం వాస్తవాధీన రేఖకు దిగువగా ఉంది. ఇదో వివాదాస్పద ప్రాంతం. సరిహద్దుకు సమీపంలోని ఇతర ప్రాంతాలపై à°ˆ చర్య  తీవ్ర పరిణామం చూపిస్తుంది’ అని భారత్ చైనా వ్యవహారాల నిపుణులు క్లాడ్ ఆర్పీ వ్యాఖ్యానించారు. సరిహద్దు వివాదానికి సంబంధించి భారత్-చైనా మధ్య ఏకాభిప్రాయం కుదిరే వరకూ వాస్తవాధీన రేఖకు కట్టుబడి ఉండాలని గతంలో కుదిరిన ఒప్పందాలు చెబుతున్నాయి. అక్కడి స్థానికుల భద్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నాయి. కానీ చైనా మాత్రం à°ˆ నిబంధనలన్నీ తరచూ అతిక్రమిస్తూ భారత్‌కు వరుస సవాళ్లు విసురుతోంది.