సీఎం జగన్‌పై విరుచుకుపడ్డ చంద్రబాబు

Published: Tuesday January 19, 2021

 సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల ప్రాణాలు తీయడమే వైసీపీకి నిత్యకృత్యంగా మారిందని చంద్రబాబు మండిపడ్డారు. 67 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఇన్ని హత్యలు చూడలేదన్నారు. 400 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని పేర్కొన్నారు. 20 నెలల్లో 2 వేల మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. 16 మంది టీడీపీ కార్యకర్తల్ని హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారని.. ఉన్మాదుల రాజ్యంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు అధ్వాన్నం కావడానికి డీజీపీనే కారణమని చంద్రబాబు ట్విట్టర్‌లో తెలిపారు.