టిప్పర్‌ లారీ ఢీకొని క్వారీ కూలీ మృతి

Published: Wednesday January 20, 2021

విశాఖ జిల్లా పాయకరావుపేట పట్టణానికి శివారున వున్న ‘వై జంక్షన్‌’ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో à°’à°• యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వద్ద వున్న ఆధార్‌ కార్డు, సెల్‌ ఫోన్‌ ఆధారంగా ఇతను గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. à°ˆ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.... గుంటూరు జిల్లా కొల్లూరు మండలం తాడిగిరిపాడు గ్రామానికి చెందిన బొల్లినేని కోటేశ్వరరావు(27) మంగళవారం రాత్రి విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు బైక్‌పై (రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌) వెళుతున్నాడు. పాయకరావుపేట వై జంక్షన్‌ వద్ద వెనుక నుంచి ఐరన్‌ లోడ్‌తో వస్తున్న లారీ ఢీకొన్నది. దీంతో అతను రోడ్డుపై పడిపోయి లారీ వెనుక చక్రాల కిందకు వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ à°¡à°¿.దీనబంధు... మృతుని వద్ద వున్న ఆధార్‌ కార్డు ఆధారంగా చిరునామా గుర్తించారు. మొబైల్‌ ఫోన్‌లోని కాంటాక్టు నంబర్లకు ఫోన్‌ చేసి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నక్కపల్లి ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

మాడుగుల రూరల్‌, జనవరి 19: మండలంలోని వమ్మలి జగన్నాథపురం ఉరలోవ కొండ క్వారీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో à°’à°• వ్యక్తి మృతిచెందాడని ఎస్‌ఐ పి.రామారావు తెలిపారు. సోమవారం సాయంత్రం టిప్పర్‌ లారీ అదుపు తప్పి క్వారీలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన నైక్‌ సుడుమ(24)ను ఢీకొందని, దీంతో అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన ఎస్‌ఐ తెలిపారు. 

కోటవురట్ల, జనవరి 19: మండలంలో పాములవాకలో కోడిపందేల శిబిరంపై మంగళవారం పోలీసులు దాడి చేసి 16 మందిని అరెస్టు చేశారు. à°ˆ సందర్భంగా లక్షాల 67 వేల 390 రూపాయల నగదు, 11 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ తెలిపారు..