అధికారులతో సీఎం జగన్‌ అత్యవసర భేటీ

Published: Monday January 25, 2021

ముఖ్యనేతలు, అధికారులతో సీఎం జగన్‌ అత్యవసర భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. à°ˆ భేటీకి డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏజీ శ్రీరామ్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరిపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఎస్‌ఈసీకి సహకరించడంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

 

 

ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని అంగీకరించమని ధర్మాసనం తేల్చి చెప్పింది. వ్యాక్సినేషన్‌ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని పేర్కొంది. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయంలో జోక్యం చేసుకోమని తెలిపింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం మంచిది కాదని, రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యవహారంతో మీకేం సంబంధమని ఘాటుగా వ్యాఖ్యానించింది.

 

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్‌ స్వల్పంగా మారింది. పంచాయతీ ఎన్నికలు వద్దంటూ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తొలి విడత ఎన్నికల ప్రక్రియకు ఆలస్యం అయింది. దీంతో మొదటి విడత ఎన్నికలను నాలుగో విడతగా మార్చి అందుకు కొత్త తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 21à°¨ నాలుగో విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇక రెండు, మూడు, నాలుగు విడతల ఎన్నికలను à°’à°•à°Ÿà°¿, రెండు, మూడు విడతలుగా మార్చి వాటిని యథాతథంగా జరపనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. మారిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 7à°¨, రెండో విడత ఫిబ్రవరి 13à°¨, మూడో విడత ఫిబ్రవరి 17, నాలుగో విడత ఫిబ్రవరి 21à°¨ జరగనున్నాయి.