బీజేపీ, జనసేన కూటమికి చిరంజీవి మద్దతు

Published: Thursday January 28, 2021

 2024లో బీజేపీ, జనసేన కూటమికి నటుడు చిరంజీవి మద్దతిస్తారని బీజేపీ నేత సోమువీర్రాజు à°ªà±à°°à°•à°Ÿà°¿à°‚చారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. తమకు ఇంకా ఎవరెవరు మద్దతిస్తారో ప్రతిపక్షాలు చూస్తారని అన్నారు. ఏపీలో బీజేపీ, జనసేన బలపడుతున్నాయని తెలిపారు. తాము అధికారంలోకి రావాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారని సోమువీర్రాజు చెప్పారు. 

 

ఇదే విషయాన్ని జనసేనకు రాజకీయంగా సహకారం అందించడానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నారని à°† పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ‘‘చిరంజీవితో పవన్‌ కల్యాణ్‌, నేను కొద్దిరోజుల క్రితం సమావేశమయ్యాం. à°† సమయంలో మళ్లీ సినిమాల్లో నటించాలని పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి సూచించారు. అలాగే, పవన్‌ కల్యాణ్‌ఖు రాజకీయంగా అండదండలు అందజేస్తానని భరోసా ఇచ్చారు’’ అని తెలిపారు. నిన్న మనోహర్ చేసిన వ్యాఖ్యలు... ఇప్పుడు వీర్రాజు చేసిన వ్యాఖ్యలతో చిరంజీవి జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో తిరుపతి నుంచి చిరంజీవి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు తమ్ముడు పవన్‌à°•à°¿ చిరంజీవి తోడుగా ఉంటారని.. జనసేన, బీజేపీ గెలుపునకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు